priyanka mohan (1)
Priyanka Mohan Latest Photos: ప్రియాంక మోహన్ ఆరుళ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నాని గ్యాంగ్‌లీడర్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో తన అందం అభినయంతో ఆకట్టుకుంది.
priyanka mohan (2)
తొలి సినిమాతో తెలుగులో సూపర్ హిట్ కొట్టింది. దీంతో ఆమెకు తెలుగులో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుందనుకున్నారు. కానీ, ఈ భామ మళ్లీ తెలుగు ఆడియన్స్‌ని పలకరించేందుకు ఐదేళ్లు గ్యాప్ తీసుకుంది.
priyanka mohan (5)
చివరిగా ఆమె నాని సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్వరలోనే ఓజీతో రాబోతోంది. పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరెక్కిన ఈ సినిమాలో ప్రియాంక హీరోయిన్గా నటించింది.
priyanka mohan (3)
ప్రస్తుతం ఓజీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న ఈ భామ తాజాగా తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. శారీతో ఓజీని ప్రమోట్ చేసింది. చీరపై కొంగుపై ఓజీ అని డిజైన్ చేయించి.. ప్రమోషనల్ షూట్లో పాల్గొంది.
priyanka mohan (4)
వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. హీరోయిన్గా తనవంతుగా సినిమా ప్రమోట్ చేస్తున్న తన వినూత్న ఆలోచనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.