Mani Ratnam: సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్స్ లో కచ్చితంగా వినిపించే పేరు మణిరత్నం. మణిరత్నం ఏ జోనర్ లో సినిమా చేసినా కూడా తను డీల్ చేసిన లవ్ స్టోరీస్ కి ఎక్కువ పేరు వచ్చింది. అందుకే మణిరత్నం ను చాలామంది లవ్ గురు అని పిలుస్తారు. రీసెంట్ టైమ్స్ లో మణిరత్నం సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ కావడం లేదు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన థగ్ లైఫ్ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది.
నాయక్ సినిమా తర్వాత వీరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అని అనౌన్స్ చేసినప్పుడు చాలామందికి అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే అంచనాలను అందుకోలేకపోయింది థగ్ లైఫ్. ఈ సినిమా తర్వాత శింబు హీరోగా సినిమా చేయబోతున్నట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ప్రస్తుతం వెట్రి మారన్ దర్శకత్వంలో శింబు సినిమా చేస్తున్న అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
మణిరత్నం దర్శకత్వంలో చెక్క చివంత వానం అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కూడా ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ప్రస్తుతం దర్శకుడు మణిరత్నం తన తర్వాత సినిమా విజయ్ సేతుపతి తో చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి అధికారిక ప్రకటన కూడా త్వరలో రానుంది.
ఈ స్క్రిప్ట్‌ను ముందుగా శింబు (STR ) కు చెప్పారు. కానీ STR ఇప్పుడు అరసన్‌తో బిజీగా ఉన్నందున, ఈ ప్రాజెక్ట్ కోసం విజయ్ సేతుపతితో ముందుకు వెళ్లాలని మణిరత్నం నిర్ణయించుకున్నారు. ఈ చిత్రానికి ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్ ను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. నటి రుక్మిణి వసంత్ (Saptha Sagaradache) ను ఈ సినిమా కోసం సంప్రదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకి సంబంధించి అధికారి ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.
మారి సెలవరాజ్ దర్శకత్వంలో వచ్చిన బైసన్ సినిమాతో రీసెంట్ మంచి సక్సెస్ అందుకున్నాడు ధృవ విక్రమ్. ఇప్పుడు ఇతను మణిరత్నం దర్శకత్వంలో లవ్ స్టోరీ చేస్తాడు అనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ ప్రాజెక్టు గురించి ప్రస్తుతం వార్తలు కూడా వినిపించడం లేదు. విజయ్ సేతుపతి సినిమా పూర్తి అయిన తర్వాత ఆ ప్రాజెక్టు ఉండే అవకాశం ఉంది అని తెలుస్తుంది.
Also Read: Jatadhara trailer : ఇంకెన్ని రోజులు అవే దయ్యాలు కథలు? ఈ దర్శక నిర్మాతలు మారరా?