OTT Movie : కామెడీ జనర్లో వచ్చిన ఒక తమిళ సినిమా నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి ఐఎండీబీలో 7.9 రేటింగ్ ఉండటం విశేషం. కామెడీ థ్రిల్లర్ లో వచ్చిన ఈ సినిమా, ఓటీటీ అభిమానులను కూడా అలరిస్తోంది. ఈ కథ కోహినూర్ వజ్రం చుట్టూ తిరుగుతుంది. ఈ వజ్రం కోసం ఒక దొంగ, బాబాగా మారుతాడు. ఆ తరువాత కథ కామెడీతో కేక పెట్టిస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? దీని పేరు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
రాజనాథన్ పెరియాసామి డైరెక్షన్ లో వచ్చిన ఈ కామెడీ సినిమా పేరు ‘కంబి కట్న కథై ‘ (Kambi katna kathai). ఇందులో నటరాజన్ సుబ్రమణియన్, సింగమ్ పులి, ముకేష్ రవి, శ్రీరంజిని, ఆర్తి, కరాటె కార్తి లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా 2025 అక్టోబర్ 17న థియేటర్లలో రిలీజైంది. నవంబర్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళ భాషలోనే ఉన్న ఈ సినిమాను రెంటల్ విధానంలోనే చూసే అవకాశం ఉంది.
Read Also : మిస్సైన కూతురి కోసం వెళ్తే ప్యాంటు తడిచే హర్రర్ సీన్లు… ఇలాంటి హర్రర్ మూవీని ఇప్పటిదాకా చూసుండరు భయ్యా
అరివు అనే వ్యక్తి చిన్న చిన్న మోసాలు చేసి జీవితం గడుపుతుంటాడు. ఒక రోజు అతను కోహినూర్ డైమండ్ ను దొంగలిస్తాడు. పోలీసులు అతన్ని వెంబడించడంతో, డైమండ్ ఒక ఖాళీ భూమిలో పాతి పెడతాడు. జైలు పనిష్‌మెంట్ తర్వాత బయటకు వచ్చినప్పుడు, ఆ భూమి ఆలయంగా మారిపోతుంది. ఆ డైమండ్ ఆలయం కిందనే ఉంటుంది. అరివు డైమండ్ తీసుకువెళ్లడానికి ఒక ఫేక్ బాబా అవతారం ఎత్తుతాడు. అతను ఆలయం చుట్టూ ఒక చిన్న ఆశ్రమంను బిల్డ్ చేస్తాడు. అక్కడ అరివు గురువుగా భక్తులను మోసం చేస్తూ, డైమండ్ తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తాడు. కానీ అశ్రమంలో డైమండ్ కోసం మరి కొన్ని క్యారెక్టర్స్ వస్తారు. ఇది కామెడీ ట్రాక్ లో వెళ్తుంది. అందరూ ఒకరినొకరు మోసం చేసుకుంటారు. ఇక్కడ కథ గందరగోళంగా మారుతుంది. వీటన్నిటినీ అధిగమించి అరివు డైమండ్ ను చేజిక్కించుకుంటాడా ? బాబా అవతారానికి ముగింపు పలుకుతాడా ?ఈ కథ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను, ఈ తమిళ కామెడీ సినిమాని చూసి తెలుసుకోండి.