Indian Womens Team: వన్డే మహిళల వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ( Womens World Cup 2025) విజేతగా టీమిండియా నిలిచింది. మొన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి మరి.. వరల్డ్ కప్ ఛాంపియన్ గా తొలిసారి నిలిచింది టీం ఇండియా. అయితే టీమిండియా ఛాంయన్ కావడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. టీమిండియా క్రికెటర్లతో పాటు అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. తొలిసారి ఛాంపియన్ అయిన మహిళల టీమిండియా జట్టుకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ ( PM Narendra Modi). ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ నివాసానికి మహిళా క్రికెటర్లు ( Indian Womens Team ) వెళ్లారు. ఈ సందర్భంగా ఒక్కో ప్లేయర్ ను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు.
Also Read: RCB: బెంగళూరుకు కొత్త కోచ్..WPL 2026 టోర్నమెంట్, Mega వేలం షెడ్యూల్ ఇదే…ఆ రోజునే ప్రారంభం
2025 మహిళల వన్డే వరల్డ్ కప్ విజేతలుగా నిలిచిన టీమిండియా మహిళల జట్టు ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ ఇంటికి వెళ్లింది. ఈ సందర్భంగా మహిళా క్రికెటర్లకు ప్రత్యేక ఆహ్వానం అందించారు మోడీ. గతంలో టీమిండియా జట్టును అభినందించినట్లుగానే.. ఒక్కో మహిళా జట్టు ప్లేయర్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంశించారు. ఆ తర్వాత అందరినీ సన్మానించారు ప్రధాని మోడీ. బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో గాయపడిన ప్రతికా రావల్ కూడా వీల్ చైర్ పై ఈవెంట్ కు వచ్చింది. ఇక ఈ సందర్భంగాప్రధాని నరేంద్ర మోడీకి స్పెషల్ గిఫ్ట్ కూడా ఇచ్చింది భారత మహిళా జట్టు. “నమో” పేరు ఉన్న టీం ఇండియా జెర్సీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బహుమతిగా ఇచ్చింది.
వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ( Womens World Cup 2025) ఛాంపియన్ గా నిలిచిన టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. 1973 నుంచి చూసుకుంటే ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గని మహిళల జట్టు.. ఈ సారి మాత్రం ఛాంపియన్ గా నిలిచింది. దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 52 పరుగులతో దుమ్ము లేపింది టీం ఇండియా. ఈ మ్యాచ్ లో లేడీ సెహ్వాగ్ షిఫాలీ వర్మ 80 కి పైగా పరుగులు చేసి దుమ్ము లేపింది. అలాగే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందాన, జమీమా, ప్రతికా రావత్, దీప్తి శర్మ, శ్రీ చరణీ, అమన్ జ్యోతికౌర్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ప్లేయర్లు టీమిండియాను ఆదుకుని చాంపియన్ గా నిలిపారు. ఈ టైటిల్ గెలిచిన నేపథ్యంలో ఐసీసీ నుంచి రూ. 40 కోట్ల వరకు టీమిండియాకు దక్కాయి. అటు భారత క్రికెట్ నియంత్రణ మండలి రూ. 51 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటన చేసింది.
Also Read: RCB: బెంగళూరుకు కొత్త కోచ్..WPL 2026 టోర్నమెంట్, Mega వేలం షెడ్యూల్ ఇదే…ఆ రోజునే ప్రారంభం
Indian Women's team gifted "Namo" signed Team India's Jersey to PM Narendra Modi. 🇮🇳🙌 pic.twitter.com/h0UsHXVS5j
— Tanuj (@ImTanujSingh) November 5, 2025