IND Vs PAK : ఆసియా కప్ 2025లో భాగంగా ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మధ్య మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. గ్రూపు దశలో పాకిస్తాన్ జట్టును భారత జట్టు చిత్తు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఇవాల సూపర్ 4 మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ పై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో తాజాగా భారత మాజీ వికెట్ కీపర్ దీప్ దాస్ గుప్త టీమిండియా ఆటగాళ్లకు వార్నింగ్ ఇచ్చాడు. ముఖ్యంగా భారత జట్టు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించాడు. పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం అంతగా ఫామ్ లో లేకపోయినా వారిని తక్కువ అంచనా వేయడం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. మరోవైపు టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలనే విషయాన్ని ఆయన స్పందించారు. ప్రస్తుతం దీప్ దాస్ గుప్త చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read : IND Vs PAK : టీమిండియా ఫ్యాన్స్ కు పాకిస్థాన్ ఆటగాడు ఆటోగ్రాఫ్…!
మరో వైపు ఒమన్ తో జరిగిన మ్యాచ్ లో అయితే టీమిండియా కీలక బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తిలకు రెస్ట్ ఇచ్చారు. ఇవాళ పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ కి వారు అందుబాటులోకి రానున్నారు. మొన్న ఒమన్ తో జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ తలకు దెబ్బ తగిలిన అక్షర్ పటేల్ ఆడటం ఇప్పుడు సందేహంగానే ఉంది. అయితే అతని స్థానంలో అర్ష్ దీప్, హర్షిత్ రాణాలలో ఒకరు తమ స్థానాన్ని నిలబెట్టుకోవచ్చు. భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూపులో ఉండటంతో రెండు మ్యాచ్ ల్లో తలపడాల్సి వచ్చింది. అయితే 2018లో కూడా అలాగే జరిగింది. కాకపోతే వన్డే ఫార్మాట్ లో జరిగింది ఆసియా కప్. 2018లో లీగ్ దశలో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. సూపర్ 4 లో కూడా ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో విజయం సాధించింది. ఫైనల్ లో టీమిండియా 2018లో బంగ్లాదేశ్ ను ఓడించి ఛాంపియన్ గా నిలిచింది. ఈ ఏడాది కూడా అలాంటి సీనే జరుగనుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సూపర్ 4లో బంగ్లాదేశ్ తొలి మ్యాచ్ లో విజయం సాధించింది.
మరోవైపు టీ-20 ఫార్మాట్ లో 2022లో ఆసియా కప్ జరిగింది. భారత్ ఇది కలిసి రాలేదు. ఫైనల్ కి చేరుకోవడంలో విఫలం చెందింది. గ్రూపు దశలో పాకిస్తాన్ ని ఓడించినప్పటికీ సూపర్ 4 స్టేజ్ లో మాత్రం భారత్ కి పరాజయం తప్పలేదు. చివరి వరకు సాగిన ఈ మ్యాచ్ లో పాక్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. తుది పోరుకు పాక్, శ్రీలంక వెళ్లాయి. శ్రీలంక విజేతగా నిలిచింది. 2023లో వన్డే ఫార్మాట్ లో ఆసియా కప్ జరిగితే.. అది వన్డే ఫార్మాట్ కావడం టీమిండియానే విజయం సాధించడం విశేషం. ప్రస్తుతం జరిగే మ్యాచ్ ఏ సంవత్సరం హిస్టరీ రిపీట్ అవుతుందోనని ఆసక్తి నెలకొనడం విశేషం.