Anantapur: అనంతపురం జిల్లా పెను ప్రమాదం చోటుచుసుకుంది. పుట్లూరు పాఠశాల నుండి మోడల్ స్కూల్, జెడ్పీ స్కూలు పిల్లులను ఆర్టీపీ బస్సులో తీసుకొని మడ్డిపల్లికి వెళ్తుండగా.. చింతకుంట దగ్గరు బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. గమనించిన స్థానికులు వెంటనే సహాయ చర్యలు చేపట్టి పిల్లలను కిందికి దింపారు. బస్సులో 50 మంది విద్యార్థులు ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో ఓ ముగ్గురు విద్యార్థులకు స్పల్ప గాయాలు అయ్యాయి. ఒక్కసారిగా స్టీరింగ్ స్ట్రక్ కావడంతో పొలాల్లోకి దూసుకెళ్ళిందని సమాచారం.