Telugu industry : ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అవకాశం సాధించుకోవాలి అంటే విపరీతంగా కష్టపడాల్సి వచ్చేది. చాలా ఆఫీసులు చుట్టూ తిరిగి ఆడిషన్స్ ఇచ్చే వాళ్ళు కొంతమంది నటులు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత తమ ప్రతిభను సోషల్ మీడియా ద్వారా చూపించడం చాలామంది మొదలుపెట్టారు. అలా సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయిన చాలామంది ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి స్థానాల్లో ఉన్నారు.
తెలుగు బిగ్ బాస్ షో కి కంటెస్టెంట్ గా హాజరైంది అలేఖ్య చిట్టి పీకిల్స్ రమ్య. పచ్చల వ్యాపారం చేస్తున్న వీళ్లు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు. ఒక కస్టమర్ ను వీళ్లు తిట్టడం వలన వీళ్ళ ఫోటోలు కూడా విపరీతంగా వైరల్ అయిపోయాయి. అలా వైరల్ అవ్వటం వలన బిగ్బాస్ షో కి రమ్య మోక్షకి కంటెస్టెంట్ గా వచ్చే అవకాశం దక్కింది. మొత్తానికి వచ్చిన రెండు వారాల్లోనే హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయింది రమ్య.
కుంభమేళాలో బాగా పాపులర్ అయిన అమ్మాయి మోనాలిసా. తన వీడియోలు విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యాయి. ఆ తర్వాత కొన్ని షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కూడా ఏమని పిలిచారు. ఇక తాజాగా తెలుగులో చేయబోతున్న ఒక సినిమాకు ఈమెను హీరోయిన్ గా తీసుకొని ఉన్నారు.
తెలుగులో లైఫ్ అనే ఒక సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా మోనాలిసా అని తీసుకున్నారు. నేడే ఈ సినిమా పూజాకార్యక్రమాలు పూర్తి చేసుకు. ఈ పూజ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది.
‘క్రష్’, ‘ఇట్స్ ఓకే గురు’ వంటి సినిమాలలో నటించిన చరణ్ సాయి ఈ సినిమాలో హీరోగా కనిపిస్తున్నారు. చరణ్ సాయి సరసన మోనాలిసా నటిస్తోంది.ఈ సినిమాను శ్రీ వెంగమాంబ మూవీస్ బ్యానర్ మీద అంజయ్య విరిగినేని, ఉషా విరిగినేని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
మొత్తానికి కొన్ని రకాల ఆఫీస్లు తిరగకపోయినా కూడా కేవలం సోషల్ మీడియాలో మంచి గుర్తింపు సాధించడం వలన, వీళ్లకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అవకాశాలు రావడం సహజంగానే జరుగుతుంది, కానీ ఇక్కడ టాలెంట్ ఉంటేనే ఎక్కువకాలం నిలబడగలం. మరి మోనాలిసా టాలెంట్ ఏంటో సినిమా ద్వారా బయటపడుతుంది. ఇప్పుడు ఎలా అయితే ఎంకరేజ్ చేస్తున్నారో. సినిమా రిజల్ట్ బట్టి ట్రోలింగ్ కూడా వస్తుంది. ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
Also Read: Pawan Kalyan: స్టైలిష్ పొలిటీషియన్, ఉస్తాద్ భగత్ సింగ్ కోసమే ఈ లుక్స్?