Raashi Khanna: హీరోయిన్ రాశి ఖన్నా వెండితెరపై బాగా పాపులర్ అయ్యింది.
ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు గడిచినా ఫ్రెష్‌గా ఇప్పుడే వచ్చానంటూ చెప్పే ప్రయత్నం చేస్తోంది.
2014-17 వరకు టాలీవుడ్‌లో ఈ బ్యూటీకి స్వర్ణయుగం. స్టార్ హీరోల సరసన నటించింది.
తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. సొంతంగా తనకంటూ అభిమానులను సొంతం చేసుకుంది.
ఆమె సినిమాలంటే యూత్ అంతా థియేటర్ల వద్ద కనిపిస్తారు.
అటు కోలీవుడ్, ఇటు హిందీలో బిజీ అవుతూ వస్తోంది.
కేవలం 33 ఏళ్లు కావడంతో మరో పదేళ్లు ఇండస్ట్రీలో ఉండేలా స్కెచ్ వేసినట్టు కనిపిస్తోంది.
ఈ క్రమంలో రకరకాల ఫోటోషూట్లతో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
అసలే అందగత్తె.. దానికితోడు శారీ, ఆపై బంగారు ఆభరణాలు ఇవన్నీ కలిసి ఆమెని మరింత అందగత్తెగా చేసింది.
దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో గిరగిరా తిరిగేస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.