BigTV English

IND VS NZ: 3వ టెస్ట్‌ లో భారీ మార్పులు..టీమిండియా నుంచి ముగ్గురు సీనియర్లు ఔట్‌ ?

IND VS NZ: 3వ టెస్ట్‌ లో భారీ మార్పులు..టీమిండియా నుంచి ముగ్గురు సీనియర్లు ఔట్‌ ?

IND VS NZ: టీమిండియా ( Team India ) ఊహించిన ఎదురు దెబ్బ తగిలింది. ఈ సంవత్సరం టెస్టుల్లో ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది టీమిండియా. అయితే న్యూజిలాండ్ తో సిరీస్ లో మాత్రం ఓటమిపాలైంది. అన్ని విభాగాల్లోనూ విఫలమైంది. ఒకప్పుడు భారత్ బలమే స్పిన్. ఇప్పుడు స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడుతోంది. శ్రీలంక టూర్ లో వన్డే సిరీస్ ను కోల్పోయిన రోహిత్ సేన ఇప్పుడు స్వదేశంలోనే టెస్ట్ సిరీస్ ను కోల్పోయింది. పెద్దగా అంచనాలు లేకుండానే భారత్ న్యూజిలాండ్ చేతిలో ఏకంగా 113 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ( WTC ) చేరాలంటే ఇకపై భారత్ వరుసగా విజయాలు సాధించాలి. దీంతో న్యూజిలాండ్ తో ( New Zealand) వాంఖడే టెస్ట్ కీలకంగా మారింది. భారత స్టార్ ఆటగాళ్ల అనుభవానికి కూడా ఈ మ్యాచ్ సవాలు విసరబోతోంది.


టీమిండియా ( Team India ) పరువు నిలబడాలంటే ఆఖరి టెస్టులో తప్పకుండా విజయం సాధించాలి. లేదంటే కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని చర్చ జోరుగా జరుగుతోంది. న్యూజిలాండ్ తో మూడో టెస్ట్ కు ముందు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ( Gautam gambhir) సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఓ రకంగా సీనియర్లకు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లే అని కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ ను రద్దు చేసినట్టుగా కథనాలు వెలువడుతున్నాయి. ఎవరైనా సరే ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొనాల్సిందేనని కఠినంగా గౌతమ్ గంభీర్ హెచ్చరించినట్టుగా తెలుస్తోంది.

Also Read: VVS Laxman: టీమిండియాకు కొత్త హెడ్ కోచ్..బీసీసీఐ సంచలనం !


సాధారణంగా స్టార్ ప్లేయర్లకు ఆప్షనల్ ప్రాక్టీస్ నుంచి ఇందులో మినహాయింపును ఇస్తారు. ఇందులో స్టార్ బ్యాటర్స్, స్టార్ బౌల్లర్స్ పాల్గొంటారా లేదా అనేది వారి ఆసక్తి మీదే ఆధారపడి ఉండేది. అసలైన మ్యాచుకు ముందు గాయపడతారనే భయంతో ఆక్షనల్ ప్రాక్టీస్ సెషన్ ను నిర్వహిస్తూ ఉంటారు. అయితే వాంకడే టెస్ట్ కు ముందు అలాంటి ఛాన్సులు లేనట్టేనని ప్రచారం జరుగుతోంది. కోహ్లీ, రోహిత్, బూమ్రా వంటి వాళ్లకు కూడా సీరియస్ గా ప్రాక్టీస్ చేయాల్సిందేనని కథనాలు వస్తున్నాయి. పూణేలో స్టార్ ప్లేయర్లు కూడా స్పిన్ ను సమర్థవంతంగా ఎదురుకోలేకపోయారు. విరాట్ స్పిన్ బలహీనతలు పదేపదే బయట పడుతున్నాయి. టెస్టుల్లో రోహిత్ శర్మ సైతం నిలకడగా రాణించలేకపోతున్నాడు.

అందుకే బ్యాటర్స్ అందరికీ ప్రత్యేకంగా స్పిన్ బౌలింగ్ లో ప్రాక్టీస్ సెషన్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో గౌతమ్ గంభీర్ ఉన్నాడని టాక్ వినిపిస్తోంది. న్యూజిలాండ్, టీమిండియా మధ్య నవంబర్ 1వ తేదీన మూడు టెస్టుల ఫార్మాట్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని కివిస్ ఆరాటపడుతోంది. భారత్ లో ( Team India ) చరిత్ర సృష్టించాలని ఆరాటపడుతోంది. ఇదే సమయంలో సిరీస్ లో న్యూజిలాండ్ ఆదిక్యాన్ని 2-1కి తగ్గించడం పైన రోహిత్ శర్మ ఫోకస్ చేసింది. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఆతిధ్య జట్టు ఆత్మ విశ్వాసం సాధించాలని అనుకుంటుంది. మూడో మ్యాచ్కు ముందు ఈనెల 30, 31న భారత్ ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొనబోతోంది. వ్యూహాలు మార్చి రోహిత్ సేన సక్సెస్ అవుతుందా. కివీస్ పైన పంజా విసురుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

శుక్రవారం నుంచి ఇండియా – న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తుది జట్టులో మూడు మార్పులు చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. బుమ్రా ( Bumrah), రిషబ్ పంత్ ( Rishabh Pant), రవీంద్ర జడేజాలకు విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్మెంట్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దీంతో మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ పేస్ ద్వయంతో భారత్ బరిలోకి దిగుతోందని సమాచారం.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×