Raashii Khanna ( Source/ Instagram )
అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మల్లో రాశి ఖన్నా.. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి వరుస హిట్ సినిమాల్లో నటించింది.
Raashii Khanna ( Source/ Instagram )
తెలుగులోకి ఊహలు గుసగుసలాడే సినిమాతో లీడ్ రోల్ లో అలరించింది. అప్పటి నుంచి తన నటనతో ఆకట్టుకుంటూ వచ్చిన రాశి ఖన్నా రవితేజ, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తో నటించినా కూడా ఎందుకో టాప్ రేంజ్ కి వెళ్లలేకపోయింది.
Raashii Khanna ( Source/ Instagram )
ఈ అమ్మడు తెలుగులో చివరగా నాగ చైతన్య సరసన జోడిగా థ్యాంక్యూ మూవీలో నటించింది. నిజానికి భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.. ఆ తర్వాత రాశి ఖన్నా తెలుగులో పెద్దగా సినిమాలు చేసినట్లు కనిపించలేదు..
Raashii Khanna ( Source/ Instagram )
రాశి ఖన్నాకి తెలుగులో ఒక క్రేజీ ఆఫర్ వచ్చింది. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ చేస్తున్న తెలుసు కదా సినిమాలో అమ్మడు నటిస్తుంది.
Raashii Khanna ( Source/ Instagram )
ఒకవైపు సినిమాలు..మరోవైపు వాణిజ్య ప్రకటనలతో ఖాళీ లేకుండా బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.
Raashii Khanna ( Source/ Instagram )
మొన్న బికినీలో కొండలలో హాట్ అందాలతో రెచ్చిపోయిన రాశి ఖన్నా తాజాగా ట్రెడిషనల్ లుక్ లో పద్ధతిగా కనిపించింది. ఆరెంజ్ కలర్ చీరలో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇటు ఓ లుక్వేసుకోండి..