Plane Crash: అమెరికాలోని కెంటకీ నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. టేకాఫ్ అయిన కాసేపటికే యూపీఎస్ కార్గో విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. 11 మంది సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. హోనులులుకు బయలుదేరిన యూపీఎస్ 2976 విమానం.. ప్రమాదానికి గురైంది. విమానం గాల్లోకి ఎగిరిన సమయంలో.. ఒక్కసారిగా మంటలు చెలరేగి కుప్పకూలింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని కెంటకీ రాష్ట్రం, లూయిస్‌విల్ నగరంలోని ముహమ్మద్ అలీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. UPS కార్గో విమానం, ఫ్లైట్ నంబర్ 2976, హోనులులుకు బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలింది. లూయిస్‌విల్ విమానాశ్రయం రన్‌వే 17R నుంచి సాయంత్రం 5:13 నుంచి 5:20 గంటల మధ్య టేకాఫ్ చేసిన విమానం, గాలిలోకి ఎగిరిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా.. మరో 11 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Also Read: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..
ప్రమాదం తెలిసిన వెంటనే లూయిస్‌విల్ ఫైర్ డిపార్ట్‌మెంట్, పోలీసు, ఎమర్జెన్సీ టీమ్‌లు స్పందించాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్‌ఫైటర్లు కృషి చేస్తున్నారు.. కానీ పెట్రోలియం వంటి పదార్థాల వల్ల కష్టం. 8 కి.మీ. ప్రాంతంలో షెల్టర్-ఇన్-ప్లేస్ ఆర్డర్ జారీ చేశారు, రోడ్లు మూసివేశారు. విమానాశ్రయంలో అన్ని ఫ్లైట్లు తాత్కాలికంగా ఆపేశారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.