Dance master:సాధారణంగా తల్లిదండ్రులు ఆడపిల్లలకు జన్మనివ్వాలి అంటే భయపడుతున్నారు. అయితే వారిని పోషించలేక కాదు సమాజం నుండి వారిని కాపాడలేక అని చాలామంది తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. చెట్టుకు చీర కట్టినా సరే కొంతమంది మానవ మృగాలు ఆడది అనుకొని అఘాయిత్యానికి పాల్పడుతున్న రోజులు. ఆడపిల్ల అయితే చాలు వయసుతో సంబంధం లేకుండా అభం శుభం తెలియని చిన్నారులపై కూడా లైంగిక దాడికి పాల్పడుతూ కొంతమంది మానవ మృగాలు తమ లైంగిక వాంఛను తీర్చుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటన ఇప్పుడు చోటు చేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిపై ఒక డాన్స్ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడిన వైనం వెలుగు చూసింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాదులోని బోయిన్ పల్లిలో డాన్స్ మాస్టర్ జ్ఞానేశ్వర్ సుబ్బు గత కొంతకాలంగా డాన్స్ స్టూడియో నిర్వహిస్తున్నారు. అయితే ఇతడి వద్ద డ్యాన్స్ నేర్చుకోవడానికి రెండు నెలల క్రితం ఒక నాలుగు సంవత్సరాల చిన్నారి చేరింది. అయితే ఎవరూ లేని సమయంలో ఆ చిన్నారితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆ చిన్నారి చాలా భయపడిపోయింది. ఇక ఏం చేయాలో.. ఎవరికి చెప్పాలో.. ఎలా చెప్పాలో.. తెలియని ఆ చిన్నారి డాన్స్ స్కూల్ కి వెళ్లాలంటనే భయపడిపోయింది. కొన్ని రోజులుగా డాన్స్ స్కూల్ కి వెళ్ళను అంటూ మారం చేసింది. దీంతో ఏమైందని తల్లిదండ్రులు గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది ఆ చిన్నారి.
ALSO READ:#NTRNeel: డైరెక్టర్‌తో గొడవలకు పుల్‌స్టాప్… కొత్త షెడ్యూల్‌కి రెడీ అవుతున్న ఎన్టీఆర్!
ఇకపోతే చిన్నారి మాటలకు నిర్ఘాంతపోయిన తల్లిదండ్రులు వెంటనే పోలీస్ స్టేషన్ లో డాన్స్ మాస్టర్ పై ఫిర్యాదు చేశారు. నిందితుడుపై పోక్సో కేసు నమోదు చేసుకున్న పోలీసులు జ్ఞానేశ్వర్ ను అరెస్టు చేశారు. ఇకపోతే ఈ విషయాన్ని ఉత్తర మండలం డీసీపీ రష్మీ పెరుమాళ్ మీడియాతో వెల్లడించారు. జ్ఞానేశ్వర్ ను రిమాండ్ కు తరలించామని.. అతడి డాన్స్ స్టూడియో ని కూడా సీజ్ చేసినట్లు స్పష్టం చేశారు.
చిన్నారులకు గుడ్ టచ్ .. బ్యాడ్ టచ్ లపై అవగాహన కల్పించాలి అని.. ఆ బాధ్యత తల్లిదండ్రులదే అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా డీసీపీ రష్మీ కూడా మాట్లాడుతూ..”చిన్నపిల్లలకు చెడు, మంచి స్పర్శలపై అవగాహన కల్పించాలి. అప్పుడే సమాజంలో వారు ఏ పరిస్థితులను ఎదుర్కొంటున్నాము అనే విషయాన్ని అర్థం చేసుకుంటారు. ముఖ్యంగా ధైర్యంగా తమ అభిప్రాయాలను బయటపెట్టేలా పిల్లలను ప్రోత్సహించాలి” అంటూ స్పష్టం చేశారు. దీంతో మరొకసారి లైంగిక వేధింపుల చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.