AP Amaravati Design: అబ్బురపరిచే నిర్మాణం.. ఔరా అనేంత ప్రకృతి కళ.. ఏ వైపు చూసినా భారీ భవనాలు.. ఒకటి కాదు రెండు కాదు అన్నీ వింతలే. ఇదొక గొప్ప నగరంగా మారి ప్రపంచాన్ని నివ్వెరపరిచేలా రూపుదిద్దుకోనుంది. ఈ నగరాన్ని చూస్తే చాలు అనే స్థాయిలో నగరం పునః నిర్మాణం సాగుతోంది. దీనికి సంబంధించి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండీగా మారింది. ఇంతకు అంతలా ఔరా అనిపించే మహా నగరం ఏదో అనుకోవద్దు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రాజధాని నగరమే అమరావతి.
2014లో రాజధాని ప్రకటన..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిని కొత్త రాజధానిగా ప్రకటించారు. ఆ తర్వాత 2015లో అమరావతి నగరాన్ని ప్రజల రాజధానిగా అభివృద్ధి చేయాలని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం ఘనంగా సాగింది. ప్రధాని నరేంద్ర మోడీ హాజరై నాడు శంఖుస్థాపన కార్యక్రమాన్ని సాగించారు. ప్రపంచం నివ్వెర పోయేలా అద్భుత రాజధాని నిర్మించాలన్న లక్ష్యంతో ఉన్న ప్రభుత్వానికి అమరావతి రైతులు అండగా నిలిచి తమ భూములు అప్పగించారు.
సింగపూర్ సిటీని తలదన్నేలా..
హైటెక్ సీఎంగా గుర్తింపు పొందిన సీఎం చంద్రబాబు రాష్ట్ర రాజధాని నిర్మాణంలో ఏ మాత్రం తగ్గేదెలే అనే తరహాలో పెద్ద ప్లాన్ వేశారు. ప్రపంచ దేశాలన్నీ నగరాన్ని చూసి నివ్వెర పోవాలన్నదే బాబు లక్ష్యం. సింగపూర్ ఆధారిత మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధాని నిర్మించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యానికి తగినట్లుగా నాటి టీడీపీ ప్రభుత్వం అడుగులు వేసినప్పటికీ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చి మూడు రాజధానులు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత అమరావతి రాజధాని అంశం పక్కకు పోయింది. ప్రస్తుతం కూటమి అధికారంలోకి రావడంతో మళ్లీ అమరావతి పునః నిర్మాణ పనులు వేగవంతంగా సాగించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది.
ఈ ప్లానింగ్ కు షాక్ కావల్సిందే
ప్రస్తుతం ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణం తిరిగి ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో, ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతోంది. ఈ పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2న హాజరై, రూ. 43,000 కోట్ల విలువైన పునర్నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. అయితే ఇక్కడ నిర్మించే భవనాలు, రహదారులు చూస్తే చాలు ఔరా అనేస్తారు. ఇప్పటికే ఇక్కడి నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక్కడ నిర్మించే రైల్వే స్టేషన్, విమానాశ్రయం దేశంలోనే నెంబర్ వన్ అనేలా నిర్మాణం సాగనున్నట్లు ఇప్పటికే సీఎం చంద్రబాబు తెలిపారు.
Also Read: AP Self-employment Loans: ఏపీలో డబ్బుల పండగ.. ఈ అర్హతలు తప్పనిసరి..
ఫస్ట్ ఫేజ్ పనులు ఇవే
ఏపీ రాజధాని పునః నిర్మాణంకు సంబంధించి మొదటి దశలో, గవర్నమెంట్ అధికారుల కోసం 3,500 అపార్ట్‌మెంట్లు, 200 బంగళాలు, ఆర్థికంగా బలహీన వర్గాల కోసం 5,000 ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ మౌలిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకొని 350 కిమీ ట్రంక్ రోడ్లు, అండర్‌గ్రౌండ్ యుటిలిటీస్, స్మార్ట్ సిటీ సదుపాయాలు నిర్మించబడుతున్నాయి. అమరావతి 217 చ.కిమీ విస్తీర్ణంలో, 2050 నాటికి 35 లక్షల జనాభా లక్ష్యంగా నిర్మాణం సాగుతుండగా, సింగపూర్ నగరాన్ని తలదన్నే నగరాన్ని నిర్మించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలను మరింత స్పీడ్ పెంచింది.
🚨 Design of upcoming world-class Amaravati city in Andhra Pradesh. pic.twitter.com/TbIBZZSUNW
— Indian Tech & Infra (@IndianTechGuide) May 1, 2025