Intinti Ramayanam Today Episode November 5th : నిన్నటి ఎపిసోడ్ లో.. చక్రధర్ దగ్గరకు వచ్చి ఒక ఆవిడ గురించి వెతకమని ఈయన ఎందుకు చెప్పాడు అని రాజేశ్వరి వచ్చి అడుగుతుంది. నాకు మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు అందుకే నేను వెతకమని చెప్పాను అని అనగానే రాజేశ్వరి మాత్రం అస్సలు నమ్మదు. ఇక మీనాక్షిని అక్షయ్ ఇంటికి తీసుకొని వస్తాడు.. అవని ఎవరో నాకు కావలసిన వాళ్లు నా దగ్గరగా వచ్చినట్లు తెలుస్తుంది.. అందుకే నా మనసు సంతోషంగా ఉంది అని అవని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్షయ్ వచ్చి అవని అని పిలుస్తాడు. ఏంటండీ తొందరగా వెళ్లాలని వెళ్లారు కదా మరి అప్పుడే వచ్చేసారేంటి అని అవని అడుగుతుంది.. అయితే నాకు ఒక చిన్న యాక్సిడెంట్ అవ్వవలసినది తప్పించుకున్నాను. నన్ను ఒక ఆవిడ కాపాడింది అని అవనితో అంటాడు.. ఆమెను ఇంటికి తీసుకొని వచ్చాను అని అంటాడు.. కానీ శ్రీయ అన్న మాటకు ఆమె పెళ్ళిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవని తన ఇంట్లోని వాళ్లకు ఎంతో సంతోషంగా తన తల్లిని పరిచయం చేస్తుంది. ఆ వచ్చిన ఆవిడ అవని వాళ్ళ తల్లి అని తెలుసుకుని అందరూ సంతోషపడతారు. మీరు నా ప్రాణాలు కాపాడడానికి వచ్చారని నాకు సంతోషంగా ఉంది అత్తయ్య గారు అని అక్షయ్ కూడా అంటాడు.. కమల్ కూడా మీరు మా అన్నయ్య ప్రాణాలు కాపాడారు అంటే మాకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య గారు అని అంటాడు.. అవని తన ఇంట్లోని వాళ్లందరినీ పరిచయం చేస్తుంది.. లోపలికి వెళ్ళగానే ఈమె ఎవరో తెలుసా ఆరాధ్యను అక్షయ్ అడుగుతాడు… మీ అమ్మ వాళ్ళ అమ్మ అంటే నీకు అమ్మమ్మ అవుతుంది అని ఆరాధ్య తో అంటాడు. భరత్ ఎక్కడ అని అడగని భరత్ కి ఫోన్ చేసి అసలు విషయాన్ని అవని చెప్తుంది..
భరత్ అమ్మ మన ఇంటికి వచ్చింది నువ్వు ప్రణతిని తీసుకొని ఇక్కడికి రా అని అవని అంటుంది.. భరత్ సరే అక్క నేను ఇప్పుడే వస్తాను అని అంటాడు.. మీనాక్షి తన కుటుంబాన్ని చూసి అవినీకి మంచి కుటుంబం దొరికింది అనే సంతోష పడుతూ ఉంటుంది.. నా కూతురు కొడుకు అదృష్టవంతులు.. ఎంత మంచి ఇంటికి కోడలుగా అల్లుడుగా వచ్చారు అని మీనాక్షి తనలో తానే సంతోష పడుతూ ఉంటుంది.. ఏంటమ్మా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని అవని అడుగుతుంది. ఏం లేదమ్మా మీరు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలని అనుభవించిన సరే దేవుడు మీ కష్టాలని గుర్తించి మీకు ఒక మంచి జీవితాన్ని కుటుంబాన్ని ఇచ్చారు అని మీనాక్షి అంటుంది..
అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే.. నేను ఒక అనాధ నేను తెలిసి కూడా ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారు. ఇక మా అత్తయ్య మామయ్య నన్ను సొంత కూతురు లాగా చూసుకున్నారు.. ఇంటికి పెద్ద కోడలుగా నేను అందరిని చక్కగా చూసుకుంటున్నాను అని అవని అంటుంది. పల్లవి తన ఫ్రెండ్ ని వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికి వెళుతుంది. పల్లవిని చూసిన తన ఫ్రెండు షాక్ అవుతుంది.. పల్లవి నువ్వేంటి ఇలా వచ్చావు అని అడుగుతుంది. నీతో ఒక చిన్న పని ఉంది అందుకే వచ్చాను అని అనగానే నాకోసం నువ్వు వెతుక్కుంటూ వచ్చావా..? అంటే ఏదో ఉంది అని రా ఇంట్లోకి గానీ తన ఫ్రెండ్ అంటుంది..
ఏంటి ఇప్పుడు చెప్పు ఎందుకు నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చావు ఏదైనా సమస్యలో ఉన్నావా అని అడుగుతుంది. సమస్యలు కాదు కానీ నాకు కొంచెం డబ్బులు కావాలి నువ్వు ఏర్పాటు చేయగలవా అని అడుగుతుంది. మీ నాన్న కోటీశ్వరుడు కదా మీ నాన్న నేను అడగొచ్చు కదా అని తన ఫ్రెండ్ అంటుంది. మా ఆయనకి అంటే మా నాన్న ఇవ్వను అన్నాడు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ నేను అక్కడ అడగాలి నువ్వు ఏదో లాగా సర్దగలవా అని అడుగుతుంది.. తన ఫ్రెండు అంత అమౌంట్ అంటే నా దగ్గర కష్టం కానీ ఒకసారి మా ఆయన్ని అడిగి తెలుసుకుంటాను అని అంటుంది.. ఇక చక్రధర్ మాత్రం మీనాక్షి ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు..
Also Read :మనోజ్ పై బాలుకు అనుమానం..బాలు, మీనాను దారుణమైన అవమానం.. ప్రభావతికి టెన్షన్..
శ్రియ మీనాక్షిని అవమానించాలా మాట్లాడుతుంది. ఆ మాటలు వినగానే కమల్ శ్రేయ ను తిడతాడు. ఇన్ని రోజులు మా వదినకి అమ్మలేరు నాన్న లేరు అనాధాన్ని అవమానించారు ఇప్పుడు ఆవిడ వచ్చిన తర్వాత కూడా మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అని అందరిపై అరుస్తాడు. పల్లవి ఇంటికి రాగానే మీనాక్షిని చూసి షాక్ అవుతుంది. ఈ విషయాన్ని తన తండ్రి కి చెప్పాలని అనుకుంటుంది కానీ ఈగో వల్ల ఫోన్ చేయడం మానేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..