శృతి, సుభాష్‌కు ఫోన్ చేసి ప్రాజెర్టు రిపోర్డు కనిపించడం లేదని చెప్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇప్పుడెలా అంటూ అందరూ ఆలోచిస్తుంటారు. రుద్రాణి వచ్చి నేను అప్పుడే చెప్పాను రాజ్, కావ్యను అక్కడి నుంచి వచ్చేయమని విన్నారా..? అంటూ అరుస్తుంది. ఇంతలో ప్రకాష్, రాజ్‌కు కాల్ చేస్తాడు. అన్నయ్య రాజ్ ఫోన్ రింగ్ అవుతుంది. అని చెప్తాడు. అయితే వెంటనే విషయం చెప్పరా అని సుభాష్ చెప్తాడు. రాజ్ కాల్ లిఫ్ట్ చేయగానే.. ప్రకాష్ విషయం మొత్తం చెప్తాడు. దీంతో రాజ్ ఇంకో ఫైల్ నా సిస్టమ్‌లో కూడా లేదు బాబాయ్ అని చెప్తాడు. మరి పెద్ద కంపెనీతో డీల్ రా వాళ్లకు డిజైన్ సబ్మిట్ చేయకపోతే వాళ్లు డీల్ క్యాన్సిల్ చేసుకుంటారురా..? అంటాడు.
డిస్కషన్ ఎందుకు చిన్నన్నయ్య రాజ్, కావ్యను వెంటనే అక్కడి నుంచి వచ్చేయమనండి అని చెప్తుంది. రాజ్ కూడా బాబాయ్ మీరేం టెన్షన్ పడకండి నేను రావాల్సిందే.. వచ్చేస్తున్నాను.. అని చెప్పి కాల్ కట్ చేయగానే.. రుద్రాణి చిన్నన్నయ్యా రాజ్ వస్తున్నాడా..? అని అడుగుతుంది. దీంతో ఇంద్రాదేవి నీకెందుకే అంత ఆత్రం అంటుంది. దీంతో రుద్రాణి యాభై కోట్లు అమ్మ నీకు అర్తం అవుతుందా..? అంటుంది. రాజ్ వస్తున్నాడు ఏదో ఒకటి చేస్తాడులే అన్నయ్య అని ప్రకాష్ చెప్పగానే.. ఒరేయ్ ఆ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయాలంటే రెండు రోజులు పడుతుందిరా..? ఇప్పుడెలా అంటాడు.. ఎన్ని రోజులైనా కానీ రాజ్ వస్తే సరి రాజ్ ఆఫీసులో ఉంటే ఏదైనా చేస్తాడు.. ఇంతకీ రాజ్ కచ్చితంగా వస్తున్నాడా..? అని మళ్లీ అడుగుతుంది. రుద్రాణి.. వస్తున్నాడు అంటూ ప్రకాష్ కోపంగా చెప్తాడు.
మరోవైపు రాజ్ టెన్షన్ పడుతుంటాడు. ఇక లాభం లేదు ఎలాగైనా వెళ్లి ఫస్ట్ మీటింగ్ క్యాన్సిల్ చేయాలి అనుకుంటూ కావ్యను పిలుస్తాడు. కావ్య రాగానే.. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అని చెప్తాడు. ఎందుకండి ఏమైంది..? అంటూ కావ్య టెన్షన్ పడుతుంది. దీంతో రాజ్ మనం వెళ్లకపోతే మనకు 50 కోట్లు నష్టం వస్తుంది. మొన్న డిజైన్ చేసిన ప్రాజెక్టు డిలీట్ అయిందట.. ఇప్పుడు మీటింగ్ క్యాన్సిల్ అవుతుంది. మనం వెళ్లిపోవాలి టైం లేదు అని చెప్పగానే.. కావ్య ఆలోచిస్తుంది.
మరోవైపు రుద్రాణి ఏంటి అన్నయ్య రాజ్, కావ్య ఇంకా రాలేదు.. అటు నుంచి అటే ఆఫీసుకు వెళ్తున్నాడా..? ఏంటి అని అడగ్గానే.. సుభాష్ కోపంగా ముందు ఆఫీసుకే కదా వెళ్లేది.. అంటాడు. దీంతో రుద్రాణి సారీ అన్నయ్య ఇదంతా నా వల్లే మీకు ఈ కష్టాలన్నీ నా కొడుకు వల్లే కదా అంటుంది. ఈ బాధ ముందు నుంచి ఉంటే మాకు ఇన్ని సమస్యలు ఎందుకుంటాయి అంటుంది అపర్ణ, స్వప్న జీవితం బాగుపడాలని కావ్య ఎంతో బాధపడింది. రాహుల్ గాణ్ని మార్చాలని రాజ్ ఎంతో కష్ట పడ్డాడు కానీ ఏం లాభం ఇవాళ తిరిగి రావాల్సి వచ్చింది అంటుంది ఇంద్రాదేవి. పోనీలేండి నా జీవితం ఇంతే అనుకుని సర్దుకుంటాను అంటుంది స్వప్న.. నేనుండగా నీకేం కానివ్వను స్వప్న అంటూ ఓదార్చినట్టు నటిస్తుంది రుద్రాణి.
మరోవైపు కావ్య ఆలోచిస్తుంటే.. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు కావ్య వెళ్దాం పద అంటాడు. దీంతో ఏవండి కాస్త ఆగండి.. ఆ రోజు రాత్రి పంపించిన ఫైలే కదా..? అని కావ్య అడగ్గానే.. అవును అవే అయితే అని రాజ్ అడుగుతాడు. మీరు చేసిన డిజైన్స్ ఎలా ఉన్నాయో చూడమని ఫైల్ మొత్తం నాకు ఫార్వర్డ్ చేశారు.. మర్చిపోయారా..? అనగానే.. అవును ఇప్పుడేంటి..? అసలు ఆ ఫైలే లేదు అంటాడు రాజ్.. కావ్య ఉంది. మీరు నాకు ఫార్వార్డ్ చేసినప్పుడు డిజైన్స్ చూసినప్పుడు నేను నా సిస్టంలో సేవ్ చేశాను. ఇప్పుడే చిన్న మామయ్యకు ఫోన్ చేసి నా సిస్టం పాస్వర్డ్ చెప్తే ఆయనే శృతికి ఫార్వార్డ్ చేస్తారు అని కావ్య చెప్పగానే.. రాజ్ ఓ థాంక్యూ కళావతి.. ఇప్పుడే కాల్ చేయ్ అని చెప్తాడు రాజ్.
దీంతో కావ్య, ప్రకాష్‌కు కాల్ చేస్తుంది. ప్రాజెక్టు రిపోర్టు ఫైల్ తన సిస్టంలో ఉందని చెప్పగానే.. అందరూ హ్యాపీగా ఫీలవుతారు. రుద్రాణి మాత్రం షాక్ అవుతుంది. వెంటనే ప్రకాష్ ఫైల్ ఫార్వార్డ్ చేయడానికి పైకి వెళ్తాడు. మరోవైపు కావ్వ, రాజ్, గోల్డ్ బాబు ముగ్గురు కలిసి రాహుల్‌కు బుద్ది చెప్పేందుకు కొత్త నాటకం ఆడతారు. ఇంతలో అపర్ణ వీడియో కాల్ చేయగానే.. ఓల్డ్ మ్యాన్ గెటప్‌లో ఉన్న రాజ్, కావ్యలను చూసి అందరూ నవ్వుకుంటారు. బాధపడుతున్న స్వప్నను ఓదారుస్తారు. తర్వాత రాత్రికి కూయిలీ గోల్డ్ బాబుకు స్పెషల్ పార్టీ ఇవ్వాలనుకుంటుంది. అందుకోసం కూయిలీ మోడ్రన్ డ్రెస్‌లో రెడీ అయి వస్తుంది. దీంతో రాహుల్ కోపంగా కూయిలీని తిడతాడు.. ఇద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. గోల్డ్ బాబు వచ్చి కూయిలీని చాలా హాట్‌గా ఉన్నావని చెప్పడంతో రాహుల్ మరింత రెచ్చిపోతాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.