Radhika Apte: బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
రక్త చరిత్ర సినిమాతో రాధికా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో నందిని అనే పాత్రలో అమ్మడి నటనకు మంచి మార్కులే పడ్డాయి.
ఇక రక్త చరిత్ర తరువాత రాధికా గురించే ఇండస్ట్రీలో చర్చ. ఆ సమయంలోనే బోయపాటి శ్రీను.. లెజెండ్ సినిమాలో రాధికకు ఛాన్స్ ఇచ్చాడు. బాలయ్య సరసన రాధికా నటించి మెప్పించింది.
(Image Source: Radhika Apte /Instagram)ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే బ్రిటన్ కు చెందిన బెనెడిక్ట్ టేలర్ తో చాలా ఏళ్ల పాటు సహజీవనం చేసిన రాధికా ఆప్టే 2012లో అతనితో పెళ్లిపీటలెక్కింది.
పెళ్లి తరువాత కూడా ఆమె భర్తను వదిలి సినిమాలు చేస్తూ ఇండియాలోనే ఉంది. దాదాపు పదేళ్ల తరువాత రాధికా గర్భవతి అయ్యింది. ఈ మధ్యనే ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చింది.
ఇక తాజాగా రాధికా తన బేబీ బంప్ ఫొటోస్ ను అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోషూట్ లో కూడా ఆమె అందాల ఆరబోతనే చేస్తూ వచ్చింది. ఒక పొడవాటి క్లాత్ ను కట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది. ముఖ్యంగా లోపల ఎలాంటి బట్టలు వేసుకోకుండా పైన వలలాంటి డ్రెస్ వేసుకున్న ఫోటోలను చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఇలాంటి ఫోటోషూట్స్ ఏంటి దారుణంగా నాటో ఏకిపారేస్తున్నారు.