Bigg Boss Tamil Vijay Sethupathi Reacts on Prank Task:బిగ్ బాస్ రియాలిటీ షో క్రేజీ గురించి చెప్పనవసరం లేదు. ఈ షోకి ఎంతటి ప్రేక్షకాదరణ ఉందో అదే స్థాయిలో విమర్శలు, వివాదాలు కూడా వెంటాడుతుంటాయి. ప్రతి భాషలోనూ బిగ్ బాస్ విమర్శలు ఎదుర్కొంటుంది. దీనికి కారణం అసలు సంబంధం లేని నటీనటులను ఒకే ఇంట్లో మూడు నెలల పాటు పెట్టడంతో ఆడమగ సంబంధం లేకుండ ఆటలు ఆడించడమే. ఇది మన సంస్కృతి కాదని, పాశ్చ్యత సంస్కృతిని ఇండియాలో ప్రొత్సాహిస్తున్నారంటూ ఎంతో సామాజిక వర్గ నేతలు వ్యతిరేకత తెలుపుతున్నారు.
మరోవైపు హౌజ్ గేమ్స్, కంటెస్టెంట్స్ తీరు కూడా షోకి మరింత వ్యతిరేకత వచ్చేలా చేస్తుంది. కొందరు మితిమిరి లవ్ ట్రాక్స్ నడిపితే.. మరికొందరు స్ట్రాటజీల పేరుతో దిగజారి ప్రవర్తిస్తున్నారు. తాజాగా తమిళ బిగ్ బాస్‌లో (Bigg Boss Tamil Seaon 9) ఇదే జరిగింది. స్ట్రాటజీ పేరుతో కంటెస్టెంట్ విపరీతంగా కొట్టుకున్నారు. ఇది చూసి మిగతా కంటెస్టెంట్స్ భయాందోళనకు లోనయ్యారు. వారి గొడవ నిజమే అనుకునని బెదిరిపోయారు. మొదట ఈ ప్రొమో చూసి కూడా ఆడియన్స్ అంత నిజమే అనుకున్నారు. కానీ, పూర్తి ఎపిసోడ్ తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది.
ప్రాంక్ పేరుతో ఇద్దరు కంటెస్టెంట్స్ ఈ గొడవకు తెరలేపారట. తెలుగులో మాదిరే తమిళంలో ప్రస్తుతం 9వ సీజన్ జరుపుకుంటుంది బిగ్ బాస్ షో. గత నెల లాంచ్ అయిన ఈ షో ప్రస్తుతం ఐదోవారంకు చేరుకుంది. ప్రస్తుతం హౌజ్‌లో 20 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే గతవారం హౌజ్లో ఇద్దరు కంటెస్టెంట్స్ మధ్య వాగ్వాదం పెరగడంతో కొట్టుకునే వరకు వెళ్లారంటూ వీడియో బయటకు వచ్చింది. షో ప్రోమోలోనూ ఇదే చూపించారు. నామినేషన్ ప్రక్రియలో జరుగుతుండగా కమరుదిన్, ప్రవీణ్ రాజ్‌ల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. వారి మధ్య మాట మాట పెరిగి పెద్ద వాగ్వాదం జరిగింది. అది మితిమిరడంతో ఇద్దరు ఘర్షణకు దిగారు.
Also Read: Bigg Boss 9 Elimination: డబుల్ ట్విస్ట్, డబుల్ ఎలిమినేషన్.. రాము రాథోడ్ అవుట్!
వారు కొట్టుకుంటుంటే హౌజ్ మేంట్స్ ఎంత ఆపుతున్న వారు ఆగలేదు. ఈ గొడవ ఓ ప్రవీణ్ రాజ్ కింద కూడా పడ్డడాడు. ఇది చూసి మిగతా వారంత భయభ్రాంతులకు గురయ్యారు. నిజమే అనుకుని భయంతో ఏడ్చేశారు. అలా హౌజ్‌లో అందరి ఎమోషన్స్‌తో ఆడుకున్నవారి వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ విజయ్ సేతుపతి చీవాట్లు పెట్టారు. మీ ప్రాంక్ హౌజ్‌మేట్స్‌ని ఎమోషనల్ దెబ్బతీసింది. ఇది అసలు సహించరాని చర్య అంటూ వారి మండపడ్డారు. అంతేకాదు ఈ వ్యవహరంలో మిగత వారి అభిప్రాయాన్ని కూడా అడిగారు. అంత కూడా వారి చర్యను వ్యతిరేకించారు. ఓ కంటెస్టెంట్ అయితే సర్ నాకో రాడు పంపించండి నిద్రలో తల పగలకొట్టి.. ప్రాంక్ అని అంటాను.. అలా అయితే ఓకే కదా అంటూ అసహనం చూపించాడు.