APSRTC Employees: ఏపీ కూటమి ప్రభుత్వం తాజాగా ఆర్టీసీ ఉద్యోగులను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ పెంపుతో ప్రజలను ఆకర్షించిన ప్రభుత్వం, ఇక ఉద్యోగుల సమస్యలపై దృష్టి కేంద్రీ కరించింది. అందులో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం.
ఏపీఎస్ఆర్టీసీ సేవలు రోజురోజుకు విస్తృత పరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎందరో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది విధులను నిర్వహిస్తూ, సంస్థ పరిరక్షణకు దోహద పడుతున్నారు. పగలు లేదు, రాత్రి లేదు వీరికి. నిరంతరం ప్రజా రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. గతంలో రాత్రి వేళ నిద్రను త్యాగం చేసి విధులు నిర్వహించిన ఆర్టీసీ సిబ్బందికి ప్రభుత్వం అలవెన్సులు మంజూరు చేసేది. కానీ ఈ అలవెన్స్ పద్దతి గత కొద్దిరోజులుగా ఆగింది.
Also Read: Sankashtahara Chaturthi vratham: ఈ ఒక్క వ్రతం ఆచరిస్తే చాలు.. మీకు, మీ ఇంట అన్నీ జయాలే!
ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. ఆర్టీసీ ఉద్యోగులకు నైటౌట్ అలవెన్సులు మంజూరు చేస్తూ ప్రకటన జారీ చేసింది. రోజుకు రూ.150 చొప్పున నైటౌట్ అలవెన్స్ ఇచ్చేలా జీవోను విడుదల చేసిన ప్రభుత్వం, వేతనంతో కలిపి ఉద్యోగులకు నైటౌట్ అలవెన్స్ ఇవ్వనున్నట్లు చెప్పడం విశేషం. దీని వల్ల ఉద్యోగులకు నెలకు రూ.3వేల నుంచి రూ.4 వేలు అదనంగా అందే వీలు ఉంది.
నైటౌట్ అలవెన్స్ ను గత వైసీపీ ప్రభుత్వం తొలగిస్తే, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు, నైటౌట్ అలవెన్స్ చెల్లింపులకు ఆదేశాలు ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరి మీరు ఆర్టీసీ ఉద్యోగా.. అయితే ఈ శుభవార్త మీ సిబ్బందికి చెప్పండి!