Actor Vikranth: టాలీవుడ్ యంగ్ హీరో విక్రాంత్ (Vikranth), చాందిని చౌదరి(Chandini chowdary) ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా చిత్రం సంతాన ప్రాప్తిరస్తు(santana praptirastu).మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల విడుదల చేసిన టీజర్ కూడా సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసింది. ఇటీవల కాలంలో సంతానం కోసం పెళ్లయిన జంటలు ఎన్నో ఇబ్బందులను పడుతున్నారు . పిల్లలు పుట్టకపోవడంతో సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఎంతో స్పష్టంగా ఈ సినిమా ద్వారా తెలియచేయబోతున్నారు.
ఇలా సంతాన ప్రాప్తిరస్తు సినిమా సరికొత్త కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని స్పష్టం అవుతుంది. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ చూస్తుంటే మాత్రం ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇకపోతే ఇటీవల హీరో విక్రాంత్ నటి చాందిని బిగ్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా హీరో విక్రాంత్ కు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఎంతో ఆసక్తి ఉన్న విక్రాంత్ వృత్తిపరంగా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అయినప్పటికీ సినిమాల కోసం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
అమెరికాలో స్థిరపడిన ఈయనకు సొంతంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉందని వెల్లడించారు. ఈ కంపెనీలో ఇప్పటికీ 700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు సంబంధించి సాఫ్ట్వేర్ రన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇండియాలో కూడా ఇలాంటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీని తీసుకురావాలని ప్రయత్నాలు చేసాము కానీ వర్క్ అవుట్ అవ్వలేదని తెలిపారు. ఇలా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఏకంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీని రన్ చేస్తూ 700 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించారనే విషయం తెలియడంతో నెటిజన్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా ఈయన ప్రొఫెషనల్ బ్యాగ్రౌండ్ ఈ స్థాయిలో ఉన్నప్పటికీ కేవలం సినిమాలు అంటే ఫ్యాషన్ తో వాటన్నింటినీ పక్కనపెట్టి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారని తెలుస్తుంది. మరి ఇండస్ట్రీలో విక్రాంత్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మా సినిమా మొత్తం కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చివరి 20 నిమిషాలు ఎమోషన్ టచ్ ఇవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి సినిమా చూసామన్న అభిప్రాయంతో బయటకు వెళ్తారని తెలిపారు. ఈ సినిమాలో అభినవ్ గోమటం, తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్ వంటి తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు.
Also Read: Suma Kanakala: పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్ నుంచి పారిపోయిన సుమ..అంత భయపడ్డారా?