Ratan tata: ప్రపంచంలో పేరు పొందిన పారిశ్రామిక వేత్త రతన్ టాటా.
వంద దేశాల్లో వ్యాపారాన్ని విస్తరించినా, ఆయన ఎప్పుడు సాధారణ జీవితం గడిపారు.
జేఆర్డీ టాటా నుంచి వారసత్వాన్ని అందుకున్న ఆయన, టాటా గ్రూప్‌ను ఉన్నత స్థాయికి చేర్చారు.
ఒక్కమాటలో చెప్పాలంటే కార్పొరేట్ టైటాన్‌గా వర్ణిస్తుంటారు.
1937, డిసెంబర్ 28న ముంబైలో పుట్టారాయన.
ముంబై, సిమ్లా, న్యూయార్క్ వంటి ప్రాంతాల్లో చదువును అభ్యసించారు.
1962 లో టాటా గ్రూప్‌లోకి ఎంట్రీ ఇచ్చారాయన. 1977లో సంక్షోభంలో ఆయన వెనుదిరిగి చూడలేదు.
1991లో టాటా సన్స్ ఛైర్మన్‌గా జేఆర్డీ టాటా వైదొలగారు.
ఆ తర్వాత గ్రూప్ బాధ్యతలు చేపట్టిన రతన్ టాటా వెనుదిరిగి చూడలేదు.
1998లో టాటా ఫస్ట్ కారును ఇండికాను ప్రారంభించారు.
ఏళ్ల గడుస్తున్నా ఇండికా పేదవాడి కారుగా స్థిరపడిపోయింది.
రెండు దశాబ్దాలపైగా టాటా గ్రూప్‌కు ఛైర్మన్‌గా వ్యవహరించిన ఆయన, గ్రూపును నలు దిశలా విస్తరించారు.
ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత వ్యాపారంలో క్రియాశీలకంగా వ్యవహరించారు.
అంతర్జాతీయంగా టాటా గ్రూపును విస్తరించడంలో ఆయన కృషి మరువలేము.
1970ల్లో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
కంపెనీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాక విస్తరించారు.
వైద్యం, ఎడ్యుకేషన్ వంటి రంగాల్లోనూ అడుగుపెట్టారాయన.