BigTV English
Advertisement

Bigg Boss 8 Day 39 Promo 1: నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్.. విరగబడి నవ్వడం పక్కా..!

Bigg Boss 8 Day 39 Promo 1: నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్.. విరగబడి నవ్వడం పక్కా..!

Bigg Boss 8 Day 39 Promo 1.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఎంటర్టైన్మెంట్ షోలలో బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ (Bigg Boss)కూడా ఒకటి. ప్రస్తుతం ఎనిమిదవ సీజన్ ప్రారంభమైంది. ఐదు వారాలు పూర్తి చేసుకోగా ఆరో వారం కూడా చివరి దశకు చేరుకుంటుంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ షో అందులో భాగంగానే ఐదు వారాలలో 6 మంది ఎలిమినేట్ అవ్వడంతో ఎనిమిది మంది మాత్రమే హౌస్ లో ఉండిపోయారు. వారిని ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ క్లాన్ గా మార్చారు బిగ్ బాస్.


వైల్డ్ కార్డుతో ఎనిమిది మంది ఎంట్రీ..

ఇక బిగ్ బాస్ హౌస్ లోకి దాదాపు 8 మంది వైల్డ్ కార్డు ద్వారా అడుగు పెట్టారు. వీరంతా కూడా గత సీజన్లలో కంటెస్టెంట్స్ గా పార్టిసిపేట్ చేసిన వారే కావడం గమనార్హం. హరితేజ, రోహిణి, గంగవ్వ, నయనీ పావని, ముక్కు అవినాష్ , టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ, మహబూబ్ ఇలా మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు. అయితే వీరికి రాయల్ క్లాన్ గా పేరు పెట్టారు బిగ్ బాస్. మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ హౌస్ లో సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ప్రోమో ను విడుదల చేయగా.. ఆ ప్రోమో కాస్త నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందించిందని చెప్పాలి.


ప్రోమో వైరల్..

తాజా ప్రోమో విషయానికి వస్తే.. కొత్త ఛాలెంజ్ లో భాగంగా కంటెస్టెంట్స్ అందరూ ఎవరికి వారు పర్ఫామెన్స్ తో అదరగొట్టేశారు. ప్రోమో మొదలవ్వగానే హీరో క్యారెక్టర్ లో ముక్కు అవినాష్ నటించగా.. అతడికి గొడుగు పట్టే బాయ్ క్యారెక్టర్ లో టేస్టీ తేజ నటించారు. టైటానిక్ 2 తీద్దామనుకుంటున్నాను.. దానికోసం ఎస్.ఎస్ రాజమౌళి గారు అప్రోచ్ అయ్యారు అంటూ ముక్కు అవినాష్ చెప్పి అందరిని ఆశ్చర్య పరిచారు. ఇక మణికంఠ గంగవ్వకు మసాజ్ చేస్తూ కీపర్ గా పనిచేశాడు. చాలా అంటే చాలా క్యూట్ గా ఉన్నారు అంటూ గంగవ్వని కూడా వదిలిపెట్టలేదు మణికంఠ.

నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్..

ఆ తర్వాత ముక్కు అవినాష్ మసాజ్ చేయించుకోవడానికి వస్తే ప్రేరణ, యష్మీ మసాజ్ చేసే అమ్మాయిలుగా నటించారు. విత్ ఆయిల్ వితౌట్ ఆయిల్ అంటూ యష్మీ అడగగా జింజర్దాల్ అంటూ ప్రేరణ కామెంట్ చేసింది. ఆ తర్వాత మణికంఠ నాకు ఏదైనా సినిమాలో కామెడీ క్యారెక్టర్ ఇవ్వండి అంటే నీకు కామెడీ క్యారెక్టర్ సెట్ అవ్వదు రా.. ఏదో ఒక దొంగ క్యారెక్టర్ ఇచ్చేయంటూ హరితేజ మెహబూబ్ తో చెబుతుంది ..ఆ తర్వాత ఇలా ఎవరికివారు మంచి పర్ఫామెన్స్ చేసి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందించారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ప్రోమోతో నెటిజన్స్ సైతం తెగ నవ్వేసుకుంటున్నారని చెప్పాలి.

Related News

Bigg Boss Telugu 9 : ఇమ్మూ బట్టతలపై బిగ్ బాస్ పంచులు… ఈ గుడ్డులో గోల ఏందయ్యా మాకు ?

Bigg Boss 9 : ఈ సీజన్ లో అలాంటి వాడు లేడు, కెప్టెన్ కి ఇచ్చి పడేసాడు 

Bigg Boss 9 Telugu Day 59 : దెయ్యాల వేట – రీతూ ఆట… హౌస్ మేట్స్ కన్నింగ్ ప్లాన్ కు డెమోన్ బలి… గౌరవ్ పై నోరు పారేసుకున్న దివ్య

Bigg Boss 9 Promo: ముద్దుబిడ్డకే చెమటలు పట్టించిన బిగ్ బాస్.. రెచ్చిపోయిన రీతూ!

Bigg Boss: బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ మధ్య గొడవ.. ఇదేం దరిద్రం రా నాయనా..

Kaushal Manda : బిగ్ బాస్ సీజన్ 9 దారుణంగా ఉంది..సెలబ్రేటిలపై కౌశల్ షాకింగ్ కామెంట్స్..

Bigg Boss 9 Telugu : హౌస్ లో ఉండగానే బంఫర్ ఆఫర్ కొట్టేసిన తనూజ.. అస్సలు ఊహించలేదు..

Bigg Boss 9 Telugu : పాలిటిక్స్ లోకి బిగ్ బాస్ భరణి..? ఆ పార్టీ సపోర్ట్ అతనికే..?

Big Stories

×