BigTV English

Ratan Tata Business Journey: చిన్న ఉద్యోగిగా చేరి.. టాటా కంపెనీకి అంతర్జాతీయ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చిన రతన్ టాటా!

Ratan Tata Business Journey: చిన్న ఉద్యోగిగా చేరి.. టాటా కంపెనీకి అంతర్జాతీయ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చిన రతన్ టాటా!

Ratan Tata Business Journey| రతన్ టాటా అంటే ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన మనిషి. భారతదేశంలోని పారిశ్రామికవేత్తలలో ఆయన దిగ్గజం లాంటి వారు. ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పాలి వచ్చినప్పుడు రతన్ టాటా కేవలం ఒక బిజినెస్ మెన్ మాత్రమే కాదు, ఒక సాదాసీదా జీవనం ఇష్టపడే మనిషి. వందల, వేల కోట్ల ఆస్తి సంపాదించినా.. ఎంతో ఒదిగి ఉండే వ్యక్తిత్వం ఆయనది. బిజినెస్ రంగంలో ఎన్నో విజయాలు చవిచూసిన ఆయన దాన కార్యాలు కూడా చాలా చేశారు. అందుకే ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయం.


రతన్ టాటా 1991 నుంచి 2012 వరకు టాటా గ్రూప్ చైర్మెన్ పదవిలో కొనసాగారు. ఈ సమయంలో ఆయన బిజినెస్ రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. టాటా వంశం పేరు పారిశ్రామిక రంగంలో ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లారు. ఒక దేశీయ బ్రాండ్‌గా ఉన్న టాటా కంపెనీలను ఆయన అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు.

1962 లో టాటా ఇండస్ట్రీస్ లో చిన్న ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించిన రతన్ టాటా జంషెడ్ పూర్ లోని టాటా ఇంజినీరింగ్ అండ్ లోకోమోటివ్ కంపెనీ ప్రస్తుతం టాటా మోటార్స్ లో ట్రైనీగా ఆరునెలలు పనిచేశారు. ఆ తరువాత టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ టిస్కో లో 1963లో చేరారు. అలా 6 సంవత్సరాలు పనిచేశాక. టాటా కంపెనీ ప్రతినిధిగా 1969లో ఆస్ట్రేలియాలో వెళ్లారు. ఆ తరువాత ఇండియా తిరిగి వచ్చి 1970లో టాటా కన్‌ల్టెన్సీ సర్వీసెస్ లో చేరారు. 1971లో ఆయన ప్రతిభను గుర్తించిన కంపెనీ ఓనర్ జెఆర్‌డీ టాటా.. ఆయనను నేషనల్ రేడియో అండ్ ఎలెక్ట్రానిక్స్ (నెల్కో) కి డైరెక్టర్ ఇన్ చార్జిగా నియమించారు. మూడేళ్ల తరువాత టాటా సన్స్ గ్రూప్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఆయనకు స్థానం లభించింది.


Also Read: బ్రహ్మచారిగా జీవించిన రతన్ టాటా.. ఆయన ప్రియురాలు ఎవరో తెలుసా?..

1961లో టాటా ఫ్యాక్టరీలో కార్మికులతో పనిచేసిన రతన్ టాటా అంచెంలంచెలుగా ఎదిగి కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అయ్యారు. అలా కింది స్థాయి నుంచి ప్రయాణం మొదలుపెట్టిన రతన్ టాటాకు కంపెనీలోని అన్ని శాఖల పనితీరుపై పట్టులభించింది. ఈ అనుభవమే టాటా గ్రూప్ కంపెనీ విజయాలకు ఉపయోగపడింది.

1991లో టాటా గ్రూప్ చైర్మన్ పదవి
1991 సంవత్సరంలో జెఆర్‌డి టాటా సన్స్ చైర్మెన్ పదవి నుంచి తప్పకున్నాక ఆయన స్థానంలో అన్ని విధాలుగా అర్హత ఉన్న రతన్ టాటా నియమితులయ్యారు. ఆ సమయంలో టాటా గ్రూప్ ఒక ఇండియన్ కాంగ్లోమెరేట్ కంపెనీ. దాని వార్షిక ఆదాయం 5 బిలియన్ డాలర్లు. అయితే ఆ తరువాత రతన్ టాటా తన పదవి కాలంలో 2012 వరకు నిరంతర కృషితో కంపెనీ వార్షిక ఆదాయాన్ని 100 బిలియన్ డాలర్లకు చేర్చారు. ఆయన హయాంలోనే టాటా గ్రూప్ కంపెనీల కార్యకలాపాలు 100 దేశాలకు విస్తరించాయి. టాటా స్టీల్, టాటా ఆటోమొబైల్స్, ఐటి సర్వీసెస్, కన్జూమర్ గూడ్స్ ఇలా అన్ని రంగాల్లో టాటా కంపెనీ ముద్ర బలంగా పడింది.

Also Read: పదేళ్ల వయసులోనే తల్లిదండ్రులకు దూరమైన రతన్ టాటా.. బాల్యం ఎలా గడిచిందంటే..

ధన సంపాదన ధ్యేయం కాదు. ప్రజల శ్రేయస్సే ముఖ్యం, దేశాభివృద్ధికే ప్రాధాన్యం అంటూ టాటా కంపెనీని ముందుకు నడిపించిన రతన్ టాటా.. టాటా గ్రూప్ ని ఒక గ్లోబల్ పవర్ హౌస్ గా మార్చారు. అంతర్జాతీయ స్థాయిలో ఇండియా పేరుని నిలబెట్టారు.

Ratan tata (credit/x and face book)
Ratan tata (credit/x and face book)

టెట్లే (2000): ఒక బ్రిటీష్ టీ కంపెనీ అయిన టెట్లేని ఒక ఇండియన్ కంపెనీ అయిన టాటా గ్రూప్ 450 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ప్రపంచ మార్కెట్ లో టాటా కంపెనీ ఎంట్రీ దీంతోనే మొదలైంది.

కోరస్ (2007) : ప్రపంచంలోనే అతిపెద్ద స్టీల్ ఉత్పత్తిదారులైన కోరస్ స్టీల్ కంపెనీని టాటా స్టీల్ 13 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.

జాగుఆర్ ల్యాండ్ రోవర్ (2008): టాటా మోటార్స్ కంపెనీని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లేందకు రతన్ టాటా ప్రముఖ బ్రిటీష్ కార్ల కంపెనీ అయిన జాగుఆర్, ల్యాండ్ రోవర్ ని 2.3 బిలియన్ డాలర్లను కొనుగోలు చేశారు. దీంతో ఒక ఇండియన కంపెనీ అంతర్జాతీయ మార్కెట్‌లో లగ్జరీ కార్లు విక్రయించం మొదలుపెట్టింది.

టాటా నానో (2008): భారతీయులకు ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలకు ఒక కారు అందుబాటు ధరలో తీసుకురావాలని రతన్ టాటా ఎంతో శ్రమించారు. అందుకే ప్రపంచలోనే అతి తక్కువ ధర కారు టాటా నానో తీసుకువచ్చారు. కేవలం రూ.లక్ష కు భారత దేశ మార్కెట్లో ప్రవేశపెట్టారు. టాటా నానో అప్పట్లో విజయవంతం కాలేదు. కానీ ఆ తరువాత వచ్చిన టాటా నానో మోడల్స్ కు ఆదరణ లభించింది.

కష్టాల్లో ధైర్యంగా నిలబడ్డ నాయకుడు రతన్ టాటా
రతన్ టాటా నాయకత్వంలో టాటా గ్రూప్ కంపెనీలు విజయాలతో పాటు కష్టాలు కూడా చవిచూశాయి. కానీ వాటిని తట్టుకొని నిలబడేందుకు రతన్ టాటా అలుపెరగకుండా శ్రమించారు. 2008లో ముంబై నగరంలో ఉగ్రవాదులు దాడి చేసిన సమయంలో టాటా గ్రూప్ కు చెందిన తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ ధ్వంసమైంది.

అయితే ఆ విధ్యంసం నుంచి తిరిగి తాజ్ మహల్ హోటల్‌ని నిలబెట్టిన ఘనత రతన్ టాటాది. దాడులు జరిగిన తరువాత కట్టుదిట్టమైన భద్రతతో మరింత బలోపేతంగా హోటల్ ని నియమించారు. ఉగ్రవాద దాడుల్లో బాధితులైన తన హోటల్ ఉద్యోగులు, అతిథులకు రతన్ టాటా అండగా నిలబడ్డారు.

రతన్ టాటా సాధించిన అవార్డులు:
పద్మ భూషన్ (2000), పద్మ విభూషణ్ (2008), ఆనరరీ కమాండర్ ఆఫ్ ధి ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్ (2009), బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్ (2006), ఓస్లో బిజినెస్ పీస్ ఆఫ్ ది ఇయర్ (2010), ఫిలాంత్రోపీ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డ్ (2014), కార్నెయీజ్ మెడల్ ఆఫ్ ఫిలాంత్రోపీ (2007), సిఎన్ఎన్ ఐబిఎన్ ఇండియాన్ ఆఫ్ ది ఇయర్ ఇన్ బిజినెస్ (2006).

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×