OTT Movie : బిగ్ బాస్ సీజన్ 9లో టాప్ కంటెస్టెంట్ గా ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది ముద్దుగుమ్మ తనుజా గౌడ. ఈ అమ్మడు కర్ణాటకలో పుట్టి, తెలుగు ఆడియన్స్ కి దగ్గరైంది. ముద్దమందారం సీరియల్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తరువాత వెండి తెరమీద కూడా తళుక్కున మెరిసింది. 2024లో ‘లీగల్లీ వీర్’ అనే సినిమాలో ముఖ్య పాత్రలో నటించింది. అయితే థియేటర్లలో ఈ సినిమాకి అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. అయితే పది నెలల తరువాత అక్టోబర్ 10 నుంచి ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. తనూజ బిగ్ బాస్ లో ఉండటంతో, ఇప్పుడు ఈ సినిమాకి మంచి వ్యూస్ వస్తున్నాయి. ఈ సినిమా ఏ ఓటీటీలోకి వచ్చింది ? దీని పేరు ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘లెగల్లీ వీర్’ (Legally veer) 2024లో వచ్చిన తెలుగు లీగల్ థ్రిల్లర్ సినిమా. రవి గోగుల దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో మాలికిరెడ్డి , ప్రియాంక దయానంద్ రెడ్డి, తనుజా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024 డిసెంబర్ 7న థియేటర్లలో రిలీజ్ అయింది. 2025 అక్టోబర్ 10 నుంచి లయన్స్ గేట్ ప్లే ఓటీటీలోకి వచ్చింది. IMDbలో 6.9/10 రేటింగ్ ని కూడా పొందింది.
‘లెగల్లీ వీర్’ తనూజా ఒక కీ రోల్ పోషించింది. ఆమె సుమిత్ర రావు అనే పాత్రలో కనిపిస్తుంది. ఈ పాత్ర కోర్ట్‌రూమ్ డ్రామాలో చాలా ముఖ్యం. సినిమా కథను టర్న్ చేసే ఒక బలమైన క్యారెక్టర్. నిజానికి సుమిత్ర నిజాయితీగా ఉండే ఒక అమ్మాయి. బలకృష్ణ అనే లాయర్ మర్డర్ కేస్ లో కీలక సాక్షిగా ఉంటుంది. అయితే రామా రాజు అనే ఒక సామాన్యుడు ఇందులో అనుమానితుడిగా ఉంటాడు. వీర్ అనే లాయర్ రామా రాజు నిర్ధోషి అని డిఫెండ్ చేస్తాడు. కానీ ఈ కేస్‌లో పవర్‌ఫుల్ పీపుల్ ఇన్వాల్వ్ అవుతారు. సుమిత్ర కోర్ట్‌లో పవర్‌ఫుల్ వ్యక్తుల నుంచి బెదిరింపులను ఫేస్ చేస్తుంది.
Read Also : 1 గంట 54 నిమిషాల మిస్టరీ థ్రిల్లర్… రన్నింగ్ ట్రైన్ లో ఊహించని ట్విస్టులు… బుర్రకు పదును పెట్టే కథ
ఈ సమయంలో ఆమె డెసిషన్స్ కేస్ డైరెక్షన్‌ను మారుస్తాయి. వాదనల తరువాత ఈ కేస్‌లో ఆమె ఒక షాకింగ్ డెసిషన్ తీసుకుంటుంది. ఆమె ఒక ఫైనల్ స్టేట్మెంట్ ఇస్తుంది. దీంతో కేసు ఒక కొలిక్కి వస్తుంది. ఆమె ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తుంది ? రామా రాజు ఇన్నోసెంట్ అని చెబుతుందా ? ఆమె స్టేట్మెంట్ వల్ల న్యాయం జరుగుతుందా ? ఈ కథ ముగింపు ఎలా ఉంటుంది ? అనే విషయాలను, బిగ్ బాస్ భామ తనూజా నటించిన, ఈ లీగల్ థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోండి.