Meesala Pilla : తెలుగు ఫిలిం ఇండస్ట్రీ దర్శక నిర్మాతలు మరి దారుణంగా తయారవుతున్నారు. ప్రేక్షకులు మనోభావాలను దెబ్బతీయటంలో అసలు వెనకాడడం లేదు. ప్రేక్షకుల సమయంతో వాళ్లకి అసలు అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే సినిమా అంటే ప్రేక్షకులకి ఎంత ఇష్టం ఉందో ప్రత్యేకించి గుర్తు చేయాల్సిన పనిలేదు. తెలుగు సినిమా కోసం ప్రేక్షకులు బానిసలుగా మారుతున్నారు.
ఇక దీపావళి సందర్భంగా బాక్సాఫీస్ వద్ద నాలుగు సినిమాలు పోటీ పడుతున్నాయి. ఈ సినిమా ట్రైలర్స్ అన్నీ కూడా విపరీతమైన ఆసక్తిని క్రియేట్ చేశాయి. సినిమాలు బాగుంటే అన్ని చూస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఒక సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తే ప్రేక్షకులంతా కూడా ఆ సినిమాకే బ్రహ్మరథం పడతారు. ఇక్కడ జరుగుతున్న అసలు విషయం ఏమిటంటే సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్న తరుణంలో ఆ సినిమాకి సంబంధించిన అప్డేట్లు ఇవ్వడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది.
అనుదీప్ కె.వి దర్శకత్వంలో విశ్వక్సేన్ హీరోగా నటించిన సినిమా ఫంకీ. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా ఆకట్టుకుంది. అనుదీప్ కి ఇది కం బ్యాక్ సినిమా అని చాలామంది అంటున్నారు. అయితే ఈ సినిమా టీజర్ 4:5 నిమిషాలకు అక్టోబర్ 10 వ తారీఖున రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. కానీ చెప్పిన టైంకి రాలేదు. అందరూ పనులు మాని వెయిట్ చేస్తూ కూర్చున్నారు.
కిరణ్ అబ్బవరం నటించిన K -Ramp సినిమా దీపావళి కానుకగా విడుదల అవుతుంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కి కూడా ఒక టైం పెట్టారు. ఈ ట్రైలర్ కూడా అనుకున్న టైం కి రాలేదు.
సిద్దు జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన దర్శకత్వంలో చేసిన సినిమా తెలుసు కదా. ఈ సినిమా ట్రైలర్ నేడు 11:34 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. టైం దాటిపోయిన కూడా ట్రైలర్ రాలేదు. చాలా సేపటి తర్వాత వచ్చిన ట్రైలర్ ఆకట్టుకుంది అది తర్వాత విషయం. కానీ చెప్పిన టైం కి రాలేదు.
పైన ప్రస్తావించిన సినిమాలు అన్నిటి గురించి పక్కన పెడితే మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి అనే విషయం ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకి సంబంధించి మీసాల పిల్ల అనే పాటను ఈరోజు విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.
చాలామంది మెగా అభిమానులతో పాటు సంగీత ప్రియులు కూడా ఉదిత్ నారాయణ పాడుతున్నాడు కాబట్టి ఈ పాట కోసం ఎదురు చూశారు. టైం దాటిపోయిన కూడా ఈ పాట రిలీజ్ కాలేదు. చిత్ర యూనిట్ పాట రేపటికి వాయిదా వేసాము అని ఒక ట్వీట్ తో చేతులు దులిపేసుకున్నారు. ఇలా అన్ని సినిమాల విషయంలో చెప్పిన డేట్ కి రాకపోతే దానికి అర్థం ఏంటి.? ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నారా అనేది దర్శక నిర్మాతలు ఆలోచించాల్సిన విషయం.
Also Read : Mohan Babu: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నుంచి ఈ విషయాలు నేర్చుకోవచ్చు, బయటకు కనిపించని మరో కోణం