Salman Khan Slams Director AR Murugadoss: బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ సినిమాలు ఈ మధ్య పెద్దగా వర్కౌట్ అవ్వడం లేదు. ఒకప్పుడు హిందీ బాక్సాఫీసుకు బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన ఈ హీరోకి ఇటీవల కాలంలో అసలు కలిసి రావడం లేదు. వరుస సినిమాలన్ని బోల్తా కొడుతున్నాయి. దీంతో ఈసారి ఎలాగైన మంచి హిట్ కొట్టాలని తమిళ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్‌తో జతకట్టాడు. వీరిద్దరి కాంబినేషన్లో సికందర్ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఈ ఏడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం డిజాస్టర్గా నిలిచింది. కనీస వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది. అయితే ఇటీవల ఈ సినిమా ఫలితంపై డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ ఊహించని కామెంట్స్ చేశారు. తమిళంలో ఆయన తెరకెక్కిన మదరాసి మూవీ రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్లో పాల్గొన్న ఆయన సికందర్ రిజల్ట్‌పై స్పందించారు. ఈ సినిమా ప్లాప్ని సల్మాన్పై వేశాడు. మూవీ ఫెయిల్ అవ్వడానికి హీరోనే బాధ్యుడంటూ బహిరంగ వ్యాఖ్యలు చేశాడు.
“హీరో సల్మాన్ మూవీ సెట్కి ఆలస్యంగా వచ్చేవాడు. కొన్ని సార్లు రాత్రి 9 తర్వాత షూటింగ్కి వచ్చేవాడు. మధ్యాహ్నం 2 గంటలకు తీయాల్సిన షాట్స్ కూడా అర్థరాత్రి 2-3 గంటలకు తీసేవాళ్లం. పిల్లల్ని స్కూల్ కి పంపే సీన్ని సల్మాన్ వల్ల అర్థరాత్రి తీయాల్సి వచ్చింది” అని చెప్పాడు. అతడి కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. సికిందర్ ప్లాప్ని డైరెక్టర్ తనపై వేసిన ఇప్పటి వరకు సల్మాన్ నోరు మెదపలేదు. కానీ, నిన్న బిగ్బాస్ సీజన్ 19 వీకెండ్ ఎపిసోడ్లో ఈ వివాదంపై స్పందించాడు. కంటెస్టెంట్స్ సంబంధించిన విషయంపై మాట్లాడుతూ.. ఈ వివాదం గురించి ప్రస్తావించాడు. ఈ సందర్భంగా డైరెక్టర్ మురుగదాస్‌కి గట్టి కౌంటర్ ఇచ్చాడు.
Also Read: Deepthi Manne: ప్రియుడిని పరిచయం చేసిన ‘రాధమ్మ కూతురు‘ సీరియల్ నటి!
తీవ్రమైన గాయాల వల్ల నే ను షూటింగ్కి ఆలస్యంగా వెళ్లాను. కానీ, దాన్ని డైరెక్టర్ మురుగదాస్ మరోలా చిత్రీకరించి నన్ను నెగిటివ్ చేశారు. ముందు నిర్మాత సాజిత్ నడియావాల తప్పుకుంటే.. ఆ తర్వాత సౌత్ సినిమా మదరాసి తీయడానికి మురుగదాస్ వెళ్లిపోయాడు. అక్కడి నటుడు షూటింగ్కి సాయంత్రం ఆరు గంటలకు వచ్చేవాడు. అందుకే సికిందర్ కంటే మదరాసి చాలా పెద్ద బ్లాక్‌బస్టర్ అయ్యింది. అంటూ సల్మాన్ డైరెక్టర్‌కి చురకలు అట్టించారు. ఇదే ఇంటర్య్వూలో ఏఆర్ మురుగదాస్ తెలుగు సినిమాలపై సెటైర్లు వేశాడు. తెలుగు సినిమాలు రూ. 1000 కోట్లు సాధించడంపై కూడా మురుగదాస్ సెటైర్లు వేశాడు. తమిళంలో తాము ఆడియన్స్‌ని ఎడ్యూకేట్ చేసే సినిమాలు చేస్తామని, అలాంటి సినిమాలు అన్ని చోట్ల కలెక్షన్స్ రాబట్టేవంటూ విచిత్రంగా స్పందించాడు.