SSMB 29: ఎస్ఎస్ఎంబి 29(SSMB 29) ఈ సినిమా కోసం అభిమానులందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(S.S.Rajamouli) దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) నటించిన మొదటి సినిమా కావడంతో మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా పట్ల ఎంతో ఆసక్తి కనబరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఒక్క పోస్టర్ మాత్రమే వదిలారు తప్ప ఇతర అప్డేట్స్ మాత్రం వెల్లడించలేదు. కనీసం ఈ సినిమా పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు కూడా బయటకు రాకుండా జక్కన్న జాగ్రత్త పడ్డారు.
చాలా పకడ్బందీగా ఈ సినిమా షూటింగ్ పనులను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించి తరుచూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తల వినపడుతూనే ఉన్నాయి. ఈ సినిమాకు “వారణాసి” అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఇటీవల ఒక వార్త బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.. అయితే తాజాగా ఈ సినిమా పెండెంట్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులోకి రావడంతో మహేష్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఒక పోస్టర్ విడుదల చేయగా అందులో మహేష్ బాబు మెడలో శివలింగం త్రిశూలం, డమరుకం, నంది, రుద్రాక్షతో కలిసిన ఒక పెండెంట్ మెడలో వేసుకున్న పోస్టర్ విడుదల చేశారు.
ఈ ఒక్క పోస్టర్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది .అయితే తాజాగా ఈ పెండెంట్ కి సంబంధించిన ఫోటోలు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. స్వయంగా బంగారంతో ఈ పెండెంట్ తయారు చేసి మార్కెట్లోకి తీసుకురావడంతో మంచి ఆదరణ లభిస్తుంది. ఇలా రాజమౌళి విడుదల చేసిన ఒకే ఒక్క పోస్టర్ తో సినిమాకు కావలసినంత పబ్లిసిటీ వచ్చిందని సినిమాపై, భారీ స్థాయిలో అంచనాలు కూడా ఏర్పడ్డాయి. ఇలా ఈ పెండెంట్ కు మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో మహేష్ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అడ్వెంచర్ సినిమాగా SSMB 29
ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఇదొక అడ్వెంచర్స్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తుంది. ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chawdary) నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు మాధవన్ కూడా నటించబోతున్నట్లు సమాచారం. ఈయన మహేష్ బాబు తండ్రి పాత్రలో కనిపించబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తలపై చిత్ర బంధం ఎక్కడ స్పందించలేదు. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ సినిమాలో భాగమయ్యారు.. ఇలా ఈ సినిమాని గ్లోబల్ రేంజ్ లో విడుదల చేయబోతున్న నేపథ్యంలో రాజమౌళి ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే నవంబర్ 16వ తేదీ ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ ఉండబోతుందంటూ వార్తలు వచ్చాయి. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారక ప్రకటన కూడా రానుంది.
Also Read: Mouli Tanuj: లిటిల్ హార్ట్స్ ఎఫెక్ట్.. రూ. కోటి రెమ్యూనరేషన్..మౌళి రియాక్షన్ ఇదే?