E-Paper
Advertisement

‎Pradeep Ranganathan: ఫౌజీ సినిమా పై టంగ్ స్లిప్ అయిన ప్రదీప్ రంగనాథన్..ఇలా చెప్పాడేంటీ?

‎Pradeep Ranganathan: ఫౌజీ సినిమా పై టంగ్ స్లిప్ అయిన ప్రదీప్ రంగనాథన్..ఇలా చెప్పాడేంటీ?
Advertisement

‎Pradeep Ranganathan: తెలుగు ప్రేక్షకులకు దర్శకుడు, హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట కోలీవుడ్ లోకి కోమాలి అనే సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రదీప్ మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా విడుదల అయ్యి సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత లవ్ టు డే సినిమాతో హీరోగా పరిచయం అవడంతో పాటు ఆ సినిమాకు తానే దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా విడుదల అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది

డ్యూడ్ ప్రమోషన్స్ లో బిజీ..

అలా రెండవ సినిమాతో కూడా మంచి హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు హీరో ప్రదీప్ రంగనాథన్. ఇలా ఒకవైపు హీరోగా మరొకవైపు దర్శకుడిగా రాణిస్తూ వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు ప్రదీప్. అయితే ఇటీవల కాలంలో తరచూ ఏదో ఒక విషయంతో హీరో ప్రదీప్ పేరు సోషల్ మీడియాలో మారు మోగుతోంది. అందులో భాగంగానే తాజాగా మరోసారి పదీప్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకంటే ప్రదీప్ రంగనాథన్ నటించిన లేటెస్ట్ మూవీ డ్యూడ్. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఇది తమిళ సినిమా కాగా ఈ సినిమాను తెలుగులో విడుదల చేయబోతుంది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ.

‎ప్రభాస్ మూవీ గురించి అప్డేట్..

Advertisement

ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా హీరో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ ప్రభాస్(Prabhas) సినిమా గురించి టంగ్ స్లిప్ అయ్యారు. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాలలో భాగంగా ప్రదీప్ మాట్లాడుతూ.. ప్రభాస్, హను రాగవపూడి కాంబోలో రాబోతున్న సినిమాకు ఫౌజీ(Fouji) సినిమా అనే సినిమా టైటిల్ ని లీక్ చేసారు. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు తాను చూసానని, చాలా అద్భుతంగా వచ్చాయి అని తెలిపారు హీరో ప్రదీప్ రంగనాథన్. అయితే ఈ సందర్భంగా ప్రదీప్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇందులో వింత ఏముంది అని అనుకుంటున్నారా..

టైటిల్ ని రివీల్ చేసిన ప్రదీప్..

Advertisement

‎డార్లింగ్ ప్రభాస్ హనురాగవపూడి(Hanu Ragavapudi) కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు ఇప్పటివరకు టైటిల్ ని అనౌన్స్ చేయలేదు మూవీ మేకర్స్. ఫౌజీ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు మొదటి నుంచి వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఆ విషయాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. కేవలం సోషల్ మీడియాలో ఊహగానాలు మాత్రమే వినిపించాయి. కానీ తాజాగా ప్రదీప్ ఆ సినిమా పేరును ప్రకటించడంతో అంటే మొదటి నుంచి వినిపించిన వార్తలు నిజమేనా అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. మరి ఈ విషయంపై మూవీ మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

Also Read: ‎Mouli Tanuj: లిటిల్ హార్ట్స్ ఎఫెక్ట్.. రూ. కోటి రెమ్యూనరేషన్..మౌళి రియాక్షన్ ఇదే?

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×