Nobel Prize Economics: ఈ ఏడాదికి గానూ ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వరించిన వ్యక్తులపై నోబెల్ బృందం ప్రకటించింది. ముగ్గురు ఆర్థికవేత్తలకు ఈ అవార్డు సంయుక్తంగా దక్కింది. జోయెల్ మోకిర్, ఫిలిప్ అగియోన్, పీటర్ హోవిట్ లకు నోబెల్ ప్రైజ్ దక్కినట్టు తెలిపింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, వైద్య శాస్త్రాల్లో ఇప్పటికే ఇప్పటికే ముగ్గురు చొప్పున నోబెల్ ఫ్రైజ్ వరించిన విషయం తెలిసిందే.
విజేతల పేర్లు..
1. జోయెల్ మోకిర్
2. ఫిలిప్ అగియోన్
3. పీటర్ హోవిట్
రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ ముగ్గురు ఆర్థికవేత్తలను ‘విష్కరణ-ఆధారిత ఆర్థిక వృద్ధిని వివరించినందుకు’ గానూ ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది. వీరి పరిశోధనలు వరల్డ్ ఎకానమీ గత రెండు శతాబ్దాలుగా సాధించిన నిరంతర ప్రగతి వెనుక ఉన్న కీలక సూత్రాలను విశ్లేషించాయి.
ALSO READ: Jagtial District: మా నాన్నను చంపేశారు.. భూమి లాక్కున్నారు, ప్రజావాణిలో చిన్నారుల ఆవేదన
జోయెట్ మోకిర్ అమెరికన్-ఇజ్రాయెలీ ఆర్థికవేత్త కాగా, హోవిట్ కెనడాకు చెందిన ఆర్థిక వేత్త, అఘియన్ ఫ్రాన్స్‌కు చెందిన ఆర్థిక వేత్త. సాంకేతిక పురోగతి ద్వారా స్థిరమైన అభివృద్ధికి ముందస్తు అవసరాలను గుర్తించినందుకు మోకిర్ ను ఈ అవార్డుకు సెలెక్ట్ చేశారు. ‘క్రియేటివ్ డిస్ట్రక్షన్’ ద్వారా నిరంతర వృద్ధి సిద్ధాంతానికి గానూ హోవిట్ పీటర్, ఫిలిప్ అగియోన్ లకు నోబెల్ ప్రకటించారు. వైద్యవిభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ఈ రోజుతో ముగిసింది.
ALSO READ: Maganti Sunitha: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. భర్తను తలచుకుని స్టేజ్ పైనే ఏడ్చేసిన మాగంటి సునీత