ఇప్పటి తరం యువతకు నల్లులు అంటే తెలియకపోవచ్చు. కానీ, వారి పేరెంట్స్ నల్లులు, అవి పెట్టే ఇబ్బంది గురించి చాలా మందికి తెలుసు. ఇప్పటికీ గ్రామాల్లో ఈ సమస్య ఉంది. ముఖ్యంగా ఇవి మంచాల్లో ఉంటూ నిద్రలేకుండా చేస్తాయి. అవి కుట్టడం వల్ల దురద కలిగిస్తాయి. ఫలితంగా నిద్ర సరిగా పట్టదు. ఇంతకీ ఇవి ఎలా పెరుగుతాయి. వాటిని ఎలా గుర్తించాలి? వాటిని ఎలా లేకుండా చేయాలో ఇప్పుడు చూద్దాం..
నల్లులు లేదంటే బెడ్ బగ్స్ అనేవి చిన్నగా, ఎర్రటి-గోధుమ రంగు వర్ణంలో ఉంటాయి. ఒక్కో నల్లి ఆపిల్ గింజ పరిమాణంలో ఉంటుంది. ఇవి ఎగరలేవు. ఎక్కువగా పరుపులు, బెడ్ ఫ్రేమ్ లు, ఫర్నిచర్, గోడలలో కూడా దాక్కుంటాయి. రాత్రి సమయంలో అవి బయటకు వచ్చి పడుకున్న వారిని కరిచి రక్తం తాగుతాయి. నల్లి కరిస్తే చర్మం మీద ఎరుపు, దురద మచ్చలు ఏర్పడుతాయి. బెడ్ షీట్లు, పరుపుల మీద చిన్న నల్ల చుక్కలు కనిపిస్తాయి. నల్లులను చంపడం వల్ల బెడ్ మీద ఎరుపు రంగు మరకలు పడే అవకాశం ఉంటుంది. నల్లులు ఉన్న గదిలో తీపి, మురికి వాసన వస్తుంది.
ఆడ నల్లి రోజుకు 1 నుంచి 5 గుడ్లు పెడుతుంది. వాటి జీవితకాలంలో 500 గుడ్లు పెడుతుంది. గుడ్లు చిన్నవిగా 1 మి.మీ పరిమాణంలో ఉంటాయి. తెల్లగా, జిగటగా ఉంటాయి. గది ఉష్ణోగ్రత దగ్గర ఈ గుడ్లు 6 నుంచి 10 రోజుల్లో పొదుగుతాయి. పొదిగిన తర్వాత చిన్న నల్లులు ఏర్పడుతాయి. ఈ నల్లులు నెమ్మదిగా 4 నుంచి 5 మి.మీ పెరుగుతాయి. 6 నుంచి 12 నెలలు జీవిస్తాయి. ఇవి 5 నుంచి 10 రోజులకు ఓసారి ఆహారం తీసుకుంటాయి. ఫుడ్ లేకుండా నెలల పాటు జీవిస్తాయి.
నల్లులను వదిలించుకోవడం అంత ఈజీ కాదు. కానీ, కొన్ని పద్దతులు పాటించడం వల్ల నల్లులను నివారించే అవకాశం ఉంటుంది.
⦿గుర్తింపు: బెడ్లు, దిండ్లు, బెడ్ ఫ్రేమ్, ఫర్నీచర్, గోడల మధ్య పగుళ్లలో ఇవి ఉంటాయి. ఫ్లాష్ లైట్ ఉపయోగించి వీటిని గుర్తించే అవకాశం ఉంటుంది.
⦿పరుపు శుభ్రం చేయాలి: దుస్తులు, దుప్పట్లు, దిండు కవర్లను తీసి వేయాలి. వేడి నీటిలో (కనీసం 120°F లేదా 49°C) 30 నిమిషాలు నానబెట్టాలి. నల్లులు, వాటి గుడ్లను చంపేందుకు కనీసం అరగంట నుంచి 90 నిమిషాలు వేడి నీటిలో ఉంచాలి.
⦿వాక్యూమ్ చేయాలి: నల్లులు, గుడ్లను దుమ్ముతో పాటు లాగేసేలా వ్యాక్యూమ్ చేయాలి. ముందుగా గట్టి బ్రష్‌తో మెట్రెస్ సీమ్ లను స్క్రబ్ చేయాలి. ఆ తర్వాత వాక్యూమ్ చేయాలి. .
⦿ఆవిరి పట్టండి: చాలా వేడిగా ఉండే ఆవిరి పట్టాలి. ను పొందండి. బెడ్లు, పిల్లో కవర్స్ ఆవిరి కారణంగా బగ్ లు చనిపోతాయి.
⦿సేఫ్ పౌడర్లను వాడాలి: బెడ్ ఫ్రేమ్స్, ఇంట్లోని గోడ పగుళ్లలోడయాటోమాసియస్ ఎర్త్ పౌడర్ చల్లాలి. ఈ పౌడర్ వల్ల బెడ్ బగ్ లు చనిపోతాయి.
Read Also: ఫ్రెండ్‌తో కలిసి నడిస్తే.. ఇలా జరుగుతుందా? చాలా మిస్ అవుతున్నారు బ్రో !