Eye Twitching: కళ్లు అదరడం అనేది సాధారణ విషయం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అదిరే కంటిని బట్టి మంచి, చెడులు జరుగుతాయని చెబుతారు. ఇదిలా ఉంటే చాలా మంది కళ్లు అదరగానే బయపడి పోతుంటారు. నిజానికి ఏ కన్ను అదిరితే మంచిదనే విషయం చాలా మందికి తెలియదు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఇది మగ వారికి ఒకలాగా.. మహిళల్లో ఒకలాగా దీని ఫలితం ఉంటుంది. ఎవరికి ఏ కన్ను అదిరితే మంచిది అనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పురుషులకు (మగవారికి):
మగవారిలో కుడి కన్ను అదిరితే.. శుభ సూచకంగా చెబుతారు. దీని వల్ల వారికి ధన లాభం, ఉద్యోగంలో విజయం, పదోన్నతి, లేదా ఏదైనా పనిలో విజయం లభిస్తుందని నమ్ముతారు. శుభవార్తలు వినే అవకాశం ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇదిలా ఉంటే ఎడమ కన్ను అదిరితే అశుభ సూచకంగా భావిస్తారు. అంతే కాకుండా దీని వల్ల ఊహించని సమస్యలు, గొడవలు, నష్టాలు ఎదుర్కోవలసి వస్తుందని చెబుతారు.
స్త్రీలకు (ఆడవారికి):
మహిళల్లో ఎడమ కన్ను అదరడం శుభ సూచకంగా చెబుతారు. అంతే కాకుండా అదృష్టం, సంతోషం, ఆకస్మిక ధన లాభం లేదా కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుందని నమ్ముతారు. అనుకున్న కార్యాలు విజయవంతమవుతాయి. ఇదిలా ఉంటే మహిళల్లో కుడి కన్ను అదిరితే.. దీనిని అశుభ సూచకంగా భావిస్తారు. అంతే కాకుండా ఆరోగ్య సమస్యలు, ఇబ్బందులు లేదా దురదృష్టం వంటివి ఎదురుకావచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు.
సైన్స్ ఏం చెబుతోంది ?
జ్యోతిష్య నమ్మకాలు ఏమైనప్పటికీ.. వైద్య పరంగా కన్ను అదరడానికి ప్రత్యేకించి మంచి లేదా చెడు ఫలితాలకు ఎటువంటి సంబంధం లేదు. ఇది కనురెప్పల చుట్టూ ఉండే కండరాలు అసంకల్పితంగా కదలడం వల్ల జరుగుతుంది. దీనికి ప్రధానంగా కారణాల గురించి సైన్స్ పరంగా..
ఒత్తిడి: అధిక ఒత్తిడి కంటి కండరాలు అదరడానికి ముఖ్య కారణం.
నిద్రలేమి : సరిగ్గా నిద్ర లేకపోవడం లేదా కంటికి తగిన విశ్రాంతి దొరకకపోవడం.
Also Read: కర్పూరంతో ఈ పరిహారాలు చేస్తే.. ఎలాంటి వాస్తు దోషాలైనా మటుమాయం !
అలసట : కంటి కండరాలు బాగా అలసిపోవడం.
కెఫిన్ లేదా ఆల్కహాల్: వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కన్ను అదిరే అవకాశం కూడా ఉంటుంది.
కంటి పొడిబారడం : కళ్ళు పొడిబారడం కూడా ఒక కారణం.
పోషకాహార లోపం: ముఖ్యంగా విటమిన్ బి12 లోపం వంటివి కూడా కన్ను అదరడానికి కారణం అవుతాయి.
చాలా సందర్భాలలో.. కన్ను అదరడం అనేది కొన్ని రోజుల్లో వాటంతట అవే తగ్గిపోతాయి. ఒకవేళ కన్ను అదరడం ఎక్కువ కాలం కొనసాగినా.. లేదా కన్ను పూర్తిగా మూసుకు పోయేలా కండరాలు సంకోచించినా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.