దేశ ప్రజలు ఎంతో అట్టహాసంగా జరుపుకునే దీపావళి, ఛత్ పూజ సమీపిస్తున్న వేళ భారతీయ రైల్వే కీలక చర్యలు చేపడుతోంది. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు అదనపు బెర్త్ లను ప్రకటించింది. దీపావళి, ఛత్ పూజను జరుపుకోవడానికి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఉద్యోగులు, కార్మికులు, స్వస్థలాలకు బయల్దేరేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే ప్రయాణీకుల రద్దీ పెరిగుతోంది. పండుగ నీటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అదనంగా 30 లక్షల బెర్తులను యాడ్ చేస్తున్నట్లు నార్త్ రైల్వే ప్రకటించింది. తన నెట్ వర్క్ అంతటా ఈ బెర్తులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. రైలు టికెట్లను బుక్ చేసుకునేటప్పుడు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) యాప్ లో ‘రిగ్రెట్ స్టేటస్’ను తొలగించేందుకే ఈ నిర్ణయం తీసకున్నట్లు ఉత్తర రైల్వే ప్రకటించింది.
పండుగ సీజన్ లో ఉత్తర రైల్వే నెట్ వర్క్ పరిధిలో ప్రయాణించే ప్యాసింజర్లు తమ రైలు టికెట్లు బుక్ చేసుకునే సమయంలో కోచ్ రిగ్రెట్ స్టేటస్ ను చూడలేరని రైల్వే అధికారులు తెలిపారు. పండుగ సీజన్ లో రైళ్లకు డిమాండ్ పెరిగేకొద్దీ, ఈ చొరవ ప్యాసింజర్లు నిరాశ చెందకుండా ప్రయాణించడానికి సహాయపడుతుందన్నారు. ‘రిగ్రెట్’ స్టేటస్ కు సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ చేపట్టామని ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ వెల్లడించారు. ప్రస్తుతానికి పలు రైళ్లకు 3000 అదనపు కోచ్‌లను యాడ్ చేసినట్లు చెప్పారు. అవసరాన్ని బట్టి మరిన్ని జోడించనున్నట్లు తెలిపారు. “పండుగల సమయంలో పూర్వాంచల్, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లోని వివిధ నగరాలకు ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ప్రత్యేక రైళ్లు ప్రకటించబడినందున, వాటి షెడ్యూల్ ను కూడా విడుదల చేస్తున్నారు” అని రైల్వే అధికారులు వెల్లడించారు.
IRCTC యాప్ లో తరచుగా ‘రిగ్రెట్ స్టేటస్’ కనిపిస్తుంది. సీట్లు అందుబాటులో లేనందున మీ టికెట్ బుకింగ్ నిర్ధారించబడదని చెప్పడమే రిగ్రేట్ స్టేటస్. రైల్లో వెయిటింగ్ లిస్ట్ 150 మంది ప్రయాణీకులను దాటిన తర్వాత ఈ స్టేటస్ కనిపిస్తుంది. ఇతరులు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే కన్ఫార్మ్ అయ్యే వెయిటింగ్ లిస్ట్ లాగా కాకుండా, రిగ్రేట్ స్టేటస్ కనిపిస్తే రైలు పూర్తిగా బుక్ అయిందని అర్థం. ప్రయాణీకులు మరొక రైలు, క్లాస్, డేట్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అదనపు బెర్త్ లను అందుబాటులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో ఇప్పుడు రిగ్రేట్ స్టేటస్ కనిపించే అవకాశం లేదంటున్నారు రైల్వే అధికారులు. ప్రయాణీకులు పండుగ సీజన్ గురించి ఆందోళన చెందకుండా టికెట్లను బుక్ చేసుకోవచ్చంటున్నారు.
అటు ఇండియన్ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులు ధృవీకరించబడిన టికెట్లలో ప్రయాణ తేదీని ఎటువంటి క్యాన్సిలేషన్ ఛార్జీ లేకుండా మార్చుకునే అవకాశం కల్పించబోతోంది. ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకునే సందర్భంలో, ప్రయాణీకులు ఛార్జీలో తేడాలు ఉంటే చెల్లించాల్సి ఉంటుంది. ఇకపై ఆ అవసరం ఉండదు. ముఖ్యంగా చివరి నిమిషంలో ప్రణాళికలు మారినప్పుడు.. ప్రయాణీకులకు ఈ అవకాశం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
Read Also: మీరు రిజర్వు చేసుకున్న సీట్లో వేరొకరు కూర్చున్నారా? ఇలా చేస్తే సీటు మీకు వచ్చేస్తుంది!