ఆడవారికి పుట్టుకతో ఒక ఇంటిపేరు, పెళ్లయ్యాక మరో ఇంటిపేరు సహజం. పెళ్లయితే భర్త ఇంటి పేరు భార్యకు వస్తుంది. అంటే పుట్టింటిపేరు, లేదా మెట్టినింటి పేరు ఈ రెండిట్లో ఒకటి ఆడవారికి ఉంటుంది. కానీ ఇక్కడ మాధురికి మూడో ఇంటిపేరు వచ్చింది. దివ్వెల మాధురి కాస్తా పెళ్లి కాకుండానే దువ్వాడ మాధురిగా మారింది. పెళ్లి కాకుండా సోషల్ మీడియాలో ఇంటి పేరు మార్చుకోవచ్చు కానీ, అధికారికంగా అది సాధ్యం కాదు. కానీ మాధురి వాటికి అతీతం అనే అనిపిస్తోంది. అందుకే ఆమె దువ్వాడ మాధురిగా ఫేమస్ అయింది. అదే పేరుతో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
దివ్వల వర్సెస్ దువ్వాడ
దివ్వల మాధురి ఈ పేరు రాష్ట్రంలో ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. MLC దువ్వాడ శ్రీనివాస్ తో కలసి ఉంటున్న మాధురి, ఇటీవల దువ్వాడ మాధురిగా ఫేమస్ అయ్యారు. సోషల్ మీడియా అకౌంట్స్ లో ఏ పేరు పెట్టుకున్నా పర్లేదు కానీ, అధికారికంగా ఆమె ఇంటిపేరు ఇంకా మారలేదు. ఎందుకంటే అటు దువ్వాడ శ్రీనివాస్ కి ఆయన భార్య వాణితో విడాకుల వ్యవహారం పూర్తి కాలేదని తెలుస్తోంది. ఇటు దివ్వల మాధురి తన భర్తతో విడాకులు తీసుకున్నాని ఇంకా చెప్పలేదు. ఇలాంటి టైమ్ లో దివ్వల మాధురి, దువ్వాడ మాధురి ఎలా అయింది. మరి బిగ్ బాస్ లో దువ్వాడ మాధురిగా జరిగే పబ్లిసిటీ వెనక అసలు కారణం ఏంటి? అనేది సస్పెన్స్.
పబ్లిసిటీ స్టంట్..
స్టార్ మా అకౌంట్ నుంచి బిగ్ బాస్ లో నెక్స్ట్ బిగ్ థింగ్ అంటూ మాధురి వీడియోని బయటపెట్టారు. మొత్తం ఆరుగురు వైల్డ్ కార్ట్ ఎంట్రీ ఇచ్చారు. ఈ ఫైర్ స్ట్రోమ్ లో మాధురి కూడా ఉన్నారు. అయితే దువ్వాడ మాధురి అంటూ ఆమెను పరిచయం చేయడం ఇక్కడ విశేషం. ఇక్కడ స్టార్ మా దువ్వాడ ఇంటిపేరుని బలంగా వాడుకోవాలని డిసైడ్ అయింది. అందుకే దివ్వల బదులు, దువ్వాడ మాధురి అంటూ ఇంట్రడ్యూస్ చేశారు. వారికి కావాల్సింది కూడా పబ్లిసిటీయే కాబట్టి దువ్వాడ మాధురి అనే పేరు బలంగా జనాల్లోకి వెళ్తోంది.
ఏంటి గేమ్ ప్లాన్..
దువ్వాడ మాధురి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన వేళ, దువ్వాడ శ్రీనివాస్ ఇంటర్వ్యూలు సంచలనంగా మారుతున్నాయి. బిగ్ బాస్ పై ఆయన పరోక్ష విమర్శలు చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆడ, మగ ఇద్దరికీ పోటీలు పెట్టడమేంటని ఆయన నిలదీశారు. ఆడవారితో పోలిస్తే మగవారు శారీరకంగా దృఢంగా ఉంటారని, అలాంటప్పుడు వారిద్దరి మధ్య పోటీలు పెట్టడమేంటని అన్నారు. మొత్తమ్మీద దువ్వాడ మాధూరీ శ్రీనివాస్ ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు. ఆమధ్య బిగ్ బాస్ నుంచి అవకాశాలు వచ్చినా ఒకర్ని మరొకరు వదిలిపెట్టి ఉండటం ఇష్టం లేక తాము వెళ్లలేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మాధురిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు దువ్వాడ శ్రీనివాస్. మరిప్పుడు ఏమవుతుందో చూడాలి.
Also Read: మాధురి ఎంట్రీ.. మామూలుగా ఉండదు
సోషల్ మీడియాలో కామెడీ..
దువ్వాడ మాధురి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ ఓ వీడియో చేశారు. దీనికి ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. ఇదే సరైన సమయం, ఇప్పటికైనా మీ భార్య దగ్గరకు వెళ్లండి అంటూ కొందరు సలహా ఇస్తున్నారు. బయట రచ్చ లేపిన మాధురి, బిగ్ బాస్ హౌస్ లో ఇంకెంత రచ్చ చేస్తారో అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. సంచలన వ్యక్తుల్ని బిగ్ బాస్ లోకి తీసుకెళ్తూ పబ్లిసిటీ పీక్స్ కి తీసుకెళ్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు.