OTT Movie : హాలీవుడ్ నుంచి వచ్చిన ఒక థ్రిల్లర్ సినిమా, గ్రిప్పింగ్ కథతో ప్రశంసలు అందుకుంటోంది. సస్పెన్స్ తో సాగే ఈ స్టోరీ చివరి వరకు చూపు తిప్పుకోకుండా చేస్తుంది. ఈ కథ ఒక మనుషుల మీద ప్రయోగించే ఒక డ్రగ్ టెస్ట్ చుట్టూ తిరుగుతుంది. ఆ డ్రగ్ తీసుకుని నిద్ర పోతే ఇక కైలాసానికి వెళ్ళినట్టే. ఒక్కొక్కరు చావుకు దగ్గర అవుతుంటారు. ఈ కథ ఉత్కంఠభరితంగా సాగుతుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘డబుల్ బ్లైండ్’ (Double blind) 2024లో వచ్చిన హారర్ థ్రిల్లర్ సినిమా. దీనికి ఇయాన్ హంట్ దర్శకత్వం వహించారు. ఇందులో మిల్లీ బ్రేడీ, పాలీయానా ప్రధాన పాత్రల్లో నటించారు. 2024 ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
క్లెయిర్ అనే యువతి ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటుంది. డబ్బు కోసం ఒక కొత్త డ్రగ్ టెస్ట్ కి సిద్ధపడుతుంది. ఇది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఈ టెస్ట్‌లో 7 మంది వాలంటీర్లు ఉంటారు. వాళ్లు 5 రోజులు ఒక బిల్డింగ్‌లో ఒంటరిగా గడపాల్సి ఉంటుంది. డాక్టర్ బర్క్ అనే మహిళ ఈ టెస్ట్‌ను వాచ్ చేస్తుంటుంది. వాళ్లకు కొత్త డ్రగ్ ఇస్తారు. మొదట్లో అంతా బాగానే ఉంటుంది. కానీ రెండో రోజు నుంచి సమస్యలు స్టార్ట్ అవుతాయి. వాళ్లు నిద్రపోతే చనిపోతారని తెలుస్తుంది. ఈ విషయం తెలిసి అక్కడ ఉన్న వాళ్ళు భయపడతారు. అయితే ఈ సారి కంపెనీ డ్రగ్ డోస్ ఎక్కువగా ఇస్తుంది. వీళ్ళంతా టెస్ట్ కోసం బిల్డింగ్‌లో లాక్ అయి ఉంటారు.
Read Also : అయ్యబాబోయ్ అన్నీ అవే సీన్లు… కన్పించిన ప్రతీ అబ్బాయిని రెచ్చగొట్టే అమ్మాయి… సింగిల్స్ కు పండగే
వాళ్లు అక్కడ 5 రోజులు పూర్తి చేస్తే, డబ్బులు ఊహించిన దాని కన్నా ఎక్కువ ఇస్తామని చెప్తారు. కానీ ఇంతలో నిద్రపోయి హఠాత్తుగా ఒకరు చనిపోతాడు. దీంతో అందరూ భయంతో గొడవ పడతారు. ఇప్పుడు క్లెయిర్ వాళ్ళకు లీడర్‌లా మారి, బయటకు రావడానికి ప్లాన్ చేస్తుంది. కానీ బిల్డింగ్ నుంచి ఎస్కేప్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. ఇక కథ సస్పెన్స్, హారర్ సీన్స్‌తో గ్రిప్పింగ్‌గా సాగుతుంది. చివరికి వీళ్ళంతా బయట పడతారా ? అందులోనే నిద్ర పోయి చనిపోతారా ? అనేది ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.