Keerthy Suresh (Source: Instragram)
కాంట్రవర్సీకి దూరంగా.. తన పని తాను చేసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షించే కీర్తి సురేష్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. సినీ బ్యాక్ గ్రౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గానే తన కెరీర్ ను ఆరంభించింది.
Keerthy Suresh (Source: Instragram)
తెలుగులో రామ్ సరసన నేను శైలజ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న కీర్తి సురేష్.. మహానటి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోయింది. అంతేకాదు ఈ సినిమాతో నేషనల్ అవార్డు కూడా అందుకుంది.
Keerthy Suresh (Source: Instragram)
ఆ తర్వాత వచ్చిన దసరా సినిమాలో డీ గ్లామరస్ పాత్ర పోషించి నటనలో పరకాయ ప్రవేశం చేయగలను అని నిరూపించిన ఈమె.. అటు బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
Keerthy Suresh (Source: Instragram)
ఇకపోతే ఇదంతా బాగానే ఉన్నా తన చిన్ననాటి స్నేహితుడిని వివాహం చేసుకుంది కీర్తి సురేష్. పెళ్లయిన మూడు రోజులకే మెడలో తాళిబొట్టు తో తాను నటించిన హిందీ చిత్రం బేబీ జాన్ సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొనింది. దీంతో కీర్తి సురేష్ ని చూసి, ఆమె సంప్రదాయాలకు ఇచ్చే విలువను చూసి ఆమెపై అందరూ ప్రశంసలు కురిపించారు.
Keerthy Suresh (Source: Instragram)
Keerthy Suresh (Source: Instragram)
అయితే ఇప్పుడు ఆ మంగళసూత్రం కారణంగానే ట్రోల్స్ ఎదుర్కొంటోంది కీర్తి సురేష్. ఎందుకంటే తాజాగా తన భర్తతో కలిసి వెకేషన్ కి వెళ్ళింది కీర్తి సురేష్. అక్కడినుంచి వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది . అందులో ఆమె మెడలో తాళిబొట్టు కనిపించడం లేదు. ఇది చూసిన నెటిజన్స్ కీర్తి సురేష్ పై ట్రోల్స్ చేస్తున్నారు. మంగళ సూత్రానికి మంగళం పాడేసినట్టేనా.. మూడు రోజుల ముచ్చటేనా అంటూ ఆమెపై పూర్తిస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఉండడం గమనార్హం.