Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం తిరుపతి నుంచి బయలుదేరిన ఏపీ ఆర్టీసీ బస్సు.. కర్నాటకలోని హౌస్ కోట్ సమీపంలో.. గొట్టిపుర గేట్ వద్ద వేగంగా వస్తున్న లారీ.. కంట్రోల్ తప్పి బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే ఏడుగురు మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన వారిలో నలుగురు.. చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు.
మృతుల వివరాలు.. కేశవరెడ్డి1(4), తులసి (21), ప్రణతి(4) మరో ఏడాది చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంగారుపాలెం మండలం పలమనేరు హైవేపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తిమ్మాజిపల్లి గ్రామ సమీపంలో పలమనేరు నుండి వేలూరు CMC ఆసుపత్రికి వెళ్తుండగా షిఫ్ట్ డిజైర్ వాహనం అదుపుతప్పి ఇద్దరు వ్యక్తులపై దూసుకెళ్లింది.
దీంతో తిమ్మాజిపల్లి గ్రామానికి చెందిన రాజేంద్రనాయుడు స్పాట్‌లోనే మృతి చెందారు. అక్కడే ఉన్న AEO సాదరయ్యకి తీవ్ర గాయాలవ్వడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు అదుపుతప్పి చెట్టుకు గుద్దిన కారులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు మృతి చెందగా నలుగురు గాయాలతో బయటపడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: ఆమెకు 27, అతనికి 53.. వివాహం జరిగిన రెండు వారాలకే వరుడు మృతి
మరోవైపు నెల్లూరు జిల్లాలో కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకటాచల మండలం కాకర్లవారిపాలెం దగ్గర.. బైక్ పై వెళుతున్న వ్యక్తిని ట్రాన్స్మిట్ మిక్సర్ లారీ ఢీకొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వెంకటరామయ్య మృతదేహంతో.. కుటుంబసభ్యులు, బంధువులు రోడ్డుపై బైఠాయించారు.. న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. చేశారు.