అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఏ ఉద్దేశాన్ని శోకసంద్రంలో ముంచింది. అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఇద్దరు పైలెట్లు, పదిమంది క్యాబిన్ సిబ్బంది కూడా ఉన్నారు. టేకాఫ్ అయిన రెండు నిమిషాల్లోనే ఈ విమానం ఒక హాస్టల్ పై కూలిపోయింది.
ఈ విమాన ప్రమాదం ప్రపంచంలోనే అత్యంత బాధాకరమైన సంఘటనలో ఒకటిగా మారింది. అయితే విమాన ప్రయాణంలో కొన్ని సీట్లు మిగతా సీట్ల కంటే సురక్షితమైనవిగా చెబుతారు. విమానంలో ఏ సీటును ఎంచుకుంటే మంచిదో తెలుసుకోండి.
ఏ సీట్ ఉత్తమం?
ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ డేటా ప్రకారం విమానం వెనుక భాగంలో కూర్చున్న ప్రయాణికులకు మరణాల రేటు తక్కువగా ఉంటుంది. ఈ డేటా ప్రకారం విమానం రెక్కకు దగ్గరగా ఉన్న సీట్లు కూడా ప్రయోజనకరంగానే ఉంటాయి. వివాహం రెక్క ముఖ్యంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ కు దగ్గరగా ఉంటాయి. ప్రమాద సమయంలో బయటకు రావడానికి ఇక్కడ ఉన్నవారికి అవకాశాలు కూడా అధికం. ఎగ్జిట్ రో దగ్గర కూర్చున్న వ్యక్తులకు కూడా బతికే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఇక్కడ కూర్చున్న వ్యక్తులకు కాళ్లు, పాదాలు నిలబెట్టుకోవడానికి ఎక్కువ స్థలం ఉంటుంది. వారు ఎగ్జిట్ వైపు త్వరగా పరిగెత్తే అవకాశం కూడా దక్కుతుంది.
ఏదైనా తుఫాను లేదా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నప్పుడు మధ్య సీట్లు సురక్షితంగా ఉంటాయి. ఈ వ్యక్తులకు రెండు వైపులా కూర్చున్న వ్యక్తుల సపోర్టు వస్తుంది. కాబట్టి వారిపై తక్కువ ప్రభావం పడుతుంది. అలాగే నడవా లోనుంచి బయటికి రావడం కూడా సులభంగా ఉంటుంది. అదే విండో సీట్ దగ్గర ఉన్న వ్యక్తి బయటికి రావాలంటే కాస్త సమయం పడుతుంది.
ఇంధన ట్యాంకు దగ్గరగా ఉన్న సీట్లలో ప్రమాదం అధికంగా ఉంటుంది. అత్యవసర ల్యాండింగ్ సమయంలో మిగిలిన ఇంధనం మంటలకు గురికావచ్చు. అటువంటి పరిస్థితుల్లో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి.
ఒకే ఒక్క మృత్యుంజయుడు
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఫ్లైట్ లో ఉన్న 242 మందిలో ఒక్క వ్యక్తి మాత్రమే బతికి బట్టకట్టాడు. అతడిని మృత్యుంజయుడుగా పిలుచుకోవచ్.చు అతని పేరు రమేష్ విశ్వకుమార్ బుచార్వాడా. ఇతడు ఇంగ్లాండు పౌరసత్వం కలిగిన వ్యక్తి. అందరూ మాంసపు ముద్దలుగా కాలిపోతే విమానం నుంచి బయటపడ్డ అదృష్టవంతుడు ఈయన ఒక్కడే. అలాంటి సంఘటన నుంచి కూడా ధైర్యంగా బయటికి నడిచి వచ్చి అంబులెన్స్ వద్దకు చేరుకున్నాడు. ఇతను ఎలా తప్పించుకున్నాడనేది ఎంతోమందికి ప్రశ్నార్థకంగా మారింది.
రమేష్ కూర్చున్న సీటు ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఉంది. డోర్ కు కుడివైపున ఇతని సీటు ఉంటుంది. ఎమర్జెన్సీ సమయంలో ఇది తప్పించుకోవడానికి ఉపయోగపడుతుంది. విమానం టేకాఫ్ అయ్యాక 30 సెకన్లకే మేడే కాల్ అనౌన్స్ చేశారు. ఆ సమయంలోనే రమేష్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటికి దూకి ఉంటాడని కొంతమంది భావిస్తున్నారు. అతను కూడా తనకు ఏం జరిగిందో తెలియదని చెబుతున్నాడు. ఒక అంచనా ప్రకారం విమాన ప్రమాదం సమయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ కి దగ్గరగా ఉండడంతో విమానంలోని ఒత్తిడి అతడిని లోపల నుండి బయటకు విసిరేసి ఉండవచ్చని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా విమాన ప్రమాదంలో ప్రాణం దక్కించుకున్న ఒకే ఒక్కడు అదృష్టవంతుడు ఈయనే.