Cloud Seeding over Delhi: చలికాలం వచ్చిందంటే దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచే నగరం.. దేశ రాజధాని ఢిల్లీ అన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే అక్కడ వింటర్లో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిని దాటిపోతుంది. గత ప్రభుత్వం ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అదుపు చేయలేకపోయిందని బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఢిల్లీలోని ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టింది. మంగళవారం నాడు ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్ నిర్వహించింది.
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కాన్పూర్ నుంచి టేకాఫ్ అయిన విమానం ఢిల్లీ మీదుగా క్లౌడ్ సీడింగ్ నిర్వహించింది. బురారి, నార్త్ కారోల్ బాగ్, భోజ్ పూర్, మయూర్ విహార్, సదక్ పూర్ ప్రాంతాల్లో నిర్వహించారు. ఢిల్లీలో వాతావరణంలో తేమస్థాయి 15-20 శాతం వరకు నమోదైంది. సాయంత్రం 6 గంటల లోపు వర్షం కురియాల్సి ఉంది. అయితే తక్కువ వాతావరణ తేమ స్థాయిలు ఉండటం వల్ల ఈ రోజు వర్షం కురిసే అవకాశం లేదని అధికారులు తెలిపారు.
Read Also: Delhi Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో బస్సుకు మంటలు..
దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు కృత్రిమ వర్షం కురింపించాల్సిన అవసరం ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా వ్యాఖ్యానించారు. వింటర్లో గాలి నాణ్యత పడిపోకుండా చూసేందుకు, అలాగే నగరం ఎదుర్కొంటున్న పర్యావరణ సవాళ్లను పరిష్కరించడంలో ఇది ఒక మార్గదర్శక అడుగు అని ఆమె అభివర్ణించారు.
గత వారం బురారి మీదుగా ప్రభుత్వం ఒక ప్రయోగాత్మక విమానాన్ని నిర్వహించింది. ఈ సమయంలో కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ఉపయోగించే సిల్వర్ అయోడైడ్, సోడియం క్లోరైడ్ సమ్మేళనాలను చిన్న మొత్తంలో విమానం నుండి విడుదల చేశారు. అయితే క్లౌడ్ సీడింగ్ సాధారణంగా అవసరమైన 50%తో పోలిస్తే, 20% కంటే తక్కువ వాతావరణ తేమ స్థాయిలు ఉండటం వల్ల, వర్షపాతం నమోదు కాలేదు.
క్లౌడ్ సీడింగ్ అంటే ఏమిటి?
క్లౌడ్ సీడింగ్ అంటే మేఘాలలో ‘వాన గింజలు’ చల్లడం. విమానాలు ఉప్పు లాంటి పొడిని మేఘాల్లో వదులుతాయి. ఆ గింజల చుట్టూ నీటి ఆవిరి అంటుకొని, అవి పెద్ద చుక్కలుగా మారి బరువెక్కి వర్షంలా కురుస్తాయి. దీనివల్ల ఎక్కువ నీరు వర్షంలా కురుస్తుంది. గాలిలోని కాలుష్యం కూడా శుభ్రపడుతుంది.
IIT Kanpur conducted a cloud seeding mission to trigger artificial rainfall aimed at reducing pollution levels in the city. Flares were released from an aircraft using advanced technology 👇 pic.twitter.com/k5AflDOfKx
— BJP Delhi (@BJP4Delhi) October 28, 2025