Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే థామా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రష్మిక.. ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండగా ప్రమోషన్స్ వేగవంతం చేసిన డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్, రష్మిక వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాలో విషయాలే కాకుండా పర్సనల్ విషయాలను కూడా పంచుకున్నారు. రష్మిక.. పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లో పని చేస్తుంది. ఈ మధ్య దీపికా పదుకొనే వలన 8 గంటల వర్క్ అవర్స్ పెద్ద వివాదాన్నే సృష్టించిన విషయం తెల్సిందే.
స్పిరిట్ సినిమాకు దీపికా.. 8 గంటలు మాత్రమే పనిచేస్తాను అని, లగ్జరీ ట్రీట్ మెంట్ కావాలని కండిషన్స్ పెట్టడం, వాటిని సందీప్ రెడ్డి వంగా తిరస్కరించడం జరిగింది. దీంతో దీపికా స్పిరిట్ కథను లీక్ చేయడంతో.. ఫైర్ అయిన వంగా సోషల్ మీడియాలో అమ్మడికి స్ట్రాంగ్ కాంటర్ ఇచ్చాడు. ఇక స్పిరిట్ ఎఫెక్ట్ కల్కి 2 నుంచి కూడా దీపికా అవుట్ అయ్యింది.
దీపికా చెప్పిన 8 గంటల పని వివాదంపై సెలబ్రిటీలు రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు. తాజాగా రష్మిక సైతం దీపికాకు సపోర్ట్ చేసింది. కానీ, తాను మాత్రం టైమ్ తో పనిలేకుండా పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చి షాక్ ఇచ్చింది. ఆరోగ్యం గురించి మాట్లాడుతూ.. ఒక రోజులో నిర్ణీత సమయం వరకు పనిచేయడం మంచి విషయం. అది కేవలం నటీనటులకే కాదు. అందరికీ వర్తిస్తుంది. అందరూ సరైన టైమ్ కి తినాలి.. నిద్రపోవాలి. అలా ఉంటేనే ఆరోగ్యం బావుంటుంది.
నేను చాలా పని చేస్తాను. నిద్ర లేకుండా చేస్తాను. నాకు టైమ్ తో పనిలేదు. నాలా ఎవరు చేయకండి. మంచిగా సమయానికి తిని , పడుకోండి. ఎందుకంటే ఆరోగ్యం చాలా ముఖ్యం. నేను తల్లి అయ్యేదని గురించి ఇప్పుడే ఆలోచిస్తున్నా.. వారు పుట్టాకా నేను ఫిట్ గా ఉండాలి. దానికోసం ఇప్పటి నుంచే కష్టపడుతున్నాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.