ఈ రోజుల్లో అనారోగ్యానికి ప్రధాన కారణం బయటి ఫుడ్ ఎక్కువగా తినడం. బిర్యానీలు, ఫాస్ట్ ఫుడ్స్ మాత్రమే కాదు, సమోసాలు తిన్నా మూల్యం చెల్లించక తప్పదంటున్నారు ఢిల్లీకి చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ శైలేష్ సింగ్. తాజాగా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన సమోసా పోస్టు వైరల్ గా మారింది. ఇందులో రూ.20 సమోసా తింటే, రూ.3 లక్షలు ఖర్చయ్యే యాంజియోప్లాస్టీ చేసుకోకతప్పదని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది. అదే సమయంలో విస్తృత చర్చకు కారణం అవుతోంది.
డాక్టర్ శైలేష్ సింగ్.. సోషల్ మీడియా పోస్టులో చిన్న చిన్న చిరుతిళ్లు పెద్ద అనారోగ్య సమస్యలకు ఎలా కారణం అవుతాయో చెప్పే ప్రయత్నం చేశారు. వేయించిన చిరుతిళ్ల కారణంగా గుండె జబ్బులు ఎలా పెరుగుతున్నాయో వెల్లడించారు. కొంత హాస్యం ఉన్నా, వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. రోజువారీగా కామన్ గా తినే రూ.20 సమోసా చివరికి రూ.3 లక్షల యాంజియోప్లాస్టీకి ఎలా దారితీస్తుందో వివరించారు. “ రోజూ ఓక రూ. 20 సమోసా. సంవత్సరానికి 300 సార్లు 15 సంవత్సరాలు తినడం వల్ల దాదాపు రూ.90,000 ఖర్చు అవుతుంది. ఆ తర్వాత గుండె క్షీణిస్తుంది. రూ. 3 లక్షలు పెట్టి యాంజియోప్లాస్టీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ చిరు తిండి అనేది మీ ధమనుల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టి 400 శాతం వడ్డీకి రుణం తీసుకోవడంతో సమానం” అని పోస్టు పెట్టారు.
ఆయన అనారోగ్యకరమైన ఫ్రైడ్ ఫుడ్స్ స్వల్పకాలిక ఆనందం కలిగించినా, దీర్ఘకాలిక హృదయ సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు డాక్టర్ సింగ్. డీప్ ఫ్రైడ్, ప్రాసెస్ చేసిన ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ధమనులు మూసుకుపోతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. గుండె జబ్బులు, రక్తపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి. డాక్టర్ సింగ్ పోస్టు చాలా మందికి ఒక వేకప్ కాల్ గా పని చేయనుంది. అనారోగ్యకర ఫుడ్ సెలెక్షన్ గుండె ఆరోగ్యాన్ని ఎలా డ్యామేజ్ చేస్తుందో హైలెట్ చేస్తుంది. జీవితంలో పెద్ద ఆరోగ్య సమస్యలతో బాధపడేందుకు బదులుగా ముందుగానే ఆ ఫుడ్ కు దూరంగా ఉండటం మంచిదని చెప్పే ప్రయత్నం చేశారు డాక్టర్ సింగ్.
Office canteen samosa: ₹20
Angioplasty: ₹3 lakhsSamosas per year: 300
Years of eating: 15
Total samosa cost: ₹90,000You're not saving money on unhealthy food.
You're taking a loan against your arteries at 400% interest.— Dr Shailesh Singh (@drShaileshSingh) October 23, 2025
ప్రైడ్, ప్రాసెస్ చేసిన ఫుడ్స్ కు బందులుగా పండ్లు, మొలకలు, కాల్చిన గింజలు తినండం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. రోజూ కనీసం 30 నిమిషాలు నడవడం, వ్యాయామం చేయాలంటున్నారు. కొలెస్ట్రాల్, రక్తపోటు, రక్తంలో చక్కెర గురించి తెలుసుకునేందుకు తరచుగా పరీక్షలు చేసుకోవాలి. చక్కెర, కెఫిన్ కలిగిన డ్రింక్స్ తీసుకోకూడదు. తగినంత విశ్రాంతి, విశ్రాంతిని ప్రోత్సహించే అభిరుచుల ద్వారా ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవచ్చంటున్నారు. ఈ అలవాట్లు హృదయ సంబంధ ఆరోగ్యానికి తోడ్పడటమే కాకుండా దీర్ఘాయువును పెంచుతాయంటున్నారు.
Read Also: ఈ చెప్పులను కాళ్లకు వేసుకోరు.. హ్యాపీగా తినేస్తారు, భలే క్రేజీగా ఉన్నాయే!