Cyclone Montha Live Updates: ఏపీ రాష్ట్ర ప్రజలను మొంథా తుఫాన్ చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొంథా తీవ్ర ప్రభావం చూపుతోంది. వైజాగ్ లో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భారీ నష్టం వాటిల్లింది. గాజువాక ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో తీర ప్రాంత వాసుల జీవనం భయంకరంగా మారింది. రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. ఇప్పటికే కోస్తా తీరాన్ని కారు మేఘాలు కమ్మేశాయి. తీర ప్రాంత వాసులను అధికారులు పునరావాసాలకు తరలిస్తున్నారు.
⦿ ఈ సమయంలో తుఫాన్ తీరం దాటే అవకాశం..
తీరాన్ని సమీపిస్తున్న కొద్ది తుఫాన్ ఉగ్రరూపం దాల్చుతోంది. ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు వాటిల్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 11 గంటల మధ్య తుఫాన్ తీరం దాటే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. తూర్పు పాలెం– కేశవదాసు పాలెం మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని చెబుతున్నారు.
⦿ ఈ ఐదు గంటలు చాలా కీలకం..
తుఫాన్ కారణంగా కరెంట్, కమ్యూనికేషన్ దెబ్బ తినే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. కాకినాడ, కొనసీమ జిల్లాలకు తుఫాన్ సమీపించిందని పేర్కొన్నారు. ఈ ఐదు గంటలకు చాలా కీలకమని అధికారులు వివరిస్తున్నారు. భీకర గాలులకు చెట్లు విరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. కాకినాడ ఉప్పాడలో సముద్రం అల్లకల్లోలంగా ఉందని చెబుతున్నారు.
⦿ మొంథా తుఫాను బీభత్సం..
మొంథా తుఫాన్ బీభత్సం కారణంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ మొంథఆ తుఫాను తీరం దాటేందుకు దగ్గర పడుతోంది. ఈ భయంకరమైన తుఫాన్ ప్రభావం దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై కూడా తీవ్రంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తుఫాను కోనసీమ వైపు కదులుతున్నప్పటికీ.. ఈ రెండు జిల్లాల్లో ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి.
⦿ కాసేపట్లో మొంథా ఉగ్రరూపం
తుఫాను కారణంగా నెల్లూరు జిల్లాలో అత్యధికంగా ఉలవపాడులో 155 మి.మీ వర్షపాతం నమోదైంది. అదేవిధంగా కావలిలో 122 మి.మీ, కందుకూరులో 119 మి.మీ వర్షం కురిసింది. ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండలో 118 మి.మీ, ఒంగోలులో 86 మి.మీ వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ నివేదికల ప్రకారం.. ఈ జిల్లాల్లో రానున్న 2-3 గంటల పాటు వర్షాలు ఏకధాటిగా కొనసాగే అవకాశం ఉంది. ఈ రాత్రికి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 200 మి.మీ వరకు వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉంది. మరోవైపు.. మొంథా తుఫాను బాపట్ల, కృష్ణా జిల్లాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. మరి కొన్ని గంటల్లో మొంథా తుఫాన్ ఎఫెక్ట్ మరిన్ని జిల్లాలపై ప్రభావం చూపనున్నట్టు అధికారులు చెబుతున్నారు.
⦿ సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లండి..
ఈ నేపథ్యంలో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ముంపు ప్రాంత వాసులు సురక్షిత ప్రాంతాల్లో తరలివెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత శిబిరాలకు తరలి వెళ్లాల్సిందిగా సూచించారు.
⦿ హెల్ప్ లైన్ నంబర్లు ఇవే..
112
1070
1800 425 0101
⦿ 40 లక్షల మందిపై తుఫాన్ ప్రభావం: నారా లోకేష్
తుఫాన్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ‘ప్రధాని మోదీ కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. తుఫాన్ దాదాపు 40 లక్షల మందిపై ప్రభావం చూపుతుంది. కాకినాడ, కొనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు రెడ్ అలర్ట్ లో ఉన్నాయి.1328 తుఫాన్ ప్రభావిత గ్రామాలను గుర్తించి సహాయక చర్యలు చేపట్టాం. ప్రాణ నష్టం ఉండకూడదన్నదే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అవసరమైతే కేంద బలగాలను రాష్ట్రంలో దింపుతాం’ అని మంత్రి నారా లోకేష్ అన్నారు.
మొంథా తుఫాన్.. దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేత
తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ అధికారులు
ఈ మేరకు దుర్గ గుడి ఘాట్ రోడ్డు మూసివేత
తుఫాన్ తీరం దాటాక సాధారణ పరిస్థితులు వచ్చేవరకు ఘాట్ రోడ్డు మూసి ఉంచాలని ఈఓ ఆదేశం
కనకదుర్గానగర్, లిఫ్ట్ మార్గం ద్వారా… pic.twitter.com/oVUwK2VnMI
— BIG TV Breaking News (@bigtvtelugu) October 28, 2025
⦿ విజయవాడ దుర్గ గుడి ఘాట్ మూసివేత..
రాష్ట్రంలో మొంథా తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో అధికారులు విజయవాడ దుర్గ గుడి ఘాట్ రోడ్డను మూసివేశారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. తుఫాన్ తీరం దాటాక సాధారణ పరిస్థితులు వచ్చే వరకు ఘాట్ రోడ్డు మూసి ఉంచాలనలి ఈవో ఆదేశాలు జారీ చేశారు. కనకదుర్గానగర్, లిఫ్ట్ మార్గం ద్వారా అమ్మవారిని దర్శించుకోవాలని భక్తులకు సూచించారు.
NON STOP RAINS IN NELLORE & PRAKASAM ⚠️
As #CycloneMontha inching towards landfall point(konaseema) the south west quadrant of system looks Massive , as a result severe rain Bands stuck many parts of these both districts, Till now ulvapadu in #Nellore recorded 155mm followed by… pic.twitter.com/uro1JUVgI1
— Eastcoast Weatherman (@eastcoastrains) October 28, 2025