Bheems ceciroleo : భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న మాస్ జాతర సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతుంది. ఈ ఈవెంట్ లో సంగీత దర్శకుడు భీమ్స్ మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయారు.
ధమాకా సినిమా చేసి ఇప్పుడు నేను చిరంజీవి గారితో పని చేస్తున్నాను. ప్రతి ప్రోత్సాహం వెనుక ఒక మానసిక స్థైర్యం ఒకరు ఉన్నారు. ఆయన గురించి చెప్పే ముందు మీ అందరికి ఒకటి చెప్పాలి. అంటూ తను ఒక ప్రత్యేకమైన పాటను స్టేజ్ మీద పాడాడు భీమ్స్. ఆ పాటను పాడుతూ నేను వీడియో తీసుకున్నాను. దాంట్లో నా ఫ్యామిలీ కూడా ఉన్నారు. నేనెందుకు వీడియో తీసానో వాళ్లకు అర్థం కాలేదు.
నిజంగా ఆ వీడియో తీసే టైం కి నేను ఇంటికి కిరాయి ఎలా కట్టాలి.? పిల్లలు ఎలా చదివించుకోవాలి? ఎలా బతకాలి? రేపు ఎలా గడపాలి? అనే ఒక సందేహంలో చిట్టచివరి రోజుల్లో చిట్టచివరి క్షణంలో ఉన్నప్పుడు.. మా ఇంట్లో సెల్ఫోన్ సిగ్నల్స్ రాని ఒక ఇంట్లో నేను ఉంటున్నప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీరు పీపుల్స్ రావాలి అని అప్పుడు నాకు ధమాకా సినిమా ఆఫర్ వచ్చింది. ఆ టైంలో నా సిచువేషన్ ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయి అనుకున్నాను.
అటువంటి టైంలో ఒక జీసస్, అల్లా, రాముడు, తిరుపతి వెంకటేశ్వర స్వామి, ఇలా మనం అందరం ఒకే దేవుళ్ళు లాగా ఒక మనిషి రూపంలో రవితేజ గారు నాకు కనిపించరు. ఆయన నాకు నిలబడ్డారు. చాలామంది ఇలానే పొగడడానికి కథలు చెప్తారు అనుకోవచ్చు. కానీ నేను నిజంగానే చెబుతున్నాను. భీమ్స్ ఎప్పుడూ కహానీలు చెప్పడు. కబుర్లు చెప్పడు.
ఇప్పుడే రీ రికార్డింగ్ చేసి వచ్చాను. నా ప్రేమను మొత్తం సంగీతం రూపంలోనే ఆయనకు చూపిస్తాను అని చెప్పాడు. నా మాటలను బాగా గుర్తుపెట్టుకోండి నేను ఒక బ్లాక్ బస్టర్ సినిమాకి సంగీతం అందించాను. చాలామంది నా సినిమా పాటలకు కామెంట్స్ వస్తున్నాయి అంటున్నారు. కానీ నేను ఎంటర్టైన్మెంట్ కోసం ఈ పాటలు చేశాను. నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ థాంక్స్. చక్రి గారి వాయిస్ తో ఒక పాటను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. దాని గురించి కూడా ప్రస్తావిస్తూ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి అని మాట్లాడాడు సంగీత దర్శకుడు భీమ్స్.
Also Read: Mass Jathara Event: స్టేజ్ పైన ఇడియట్ సాంగ్ రీ క్రియేట్ చేసిన రవితేజ, శ్రీ లీల