Mass jathara Pre Release: డైరెక్టర్ భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ(Raviteja) శ్రీ లీల (Sreeleela)హీరో హీరోయిన్లుగా నటించిన మాస్ జాతర(Mass Jathara) సినిమా అక్టోబర్ 31వ తేదీ ప్రీమియర్లు ప్రసారం కాబోతోంది. నవంబర్ ఒకటవ తేదీ ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో నటి కిరీటి రాజేంద్రప్రసాద్(Rajendraprasad) మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ మాస్ జాతర సినిమా చాలా అద్భుతంగా ఉంటుందని ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని ఈ సినిమా మంచి సక్సెస్ కాకపోతే నేను ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతానని తెలిపారు. తాను జులాయి సినిమా నుంచి మొదలుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలతో నటించి హిట్ కొట్టాను కానీ రవితేజను మిస్ అయ్యాము. అయితే ఈ సినిమాతో మరో హిట్ కొట్టబోతున్నామని తెలిపారు. ఇలా ఈ సినిమా గురించి అలాగే ఈ సినిమాలో తన పాత్ర గురించి కూడా రాజేంద్రప్రసాద్ మాట్లాడారు.
ఈ సినిమాలో నేనేంటి నా పాత్ర ఏంటి అంటూ మాట్లాడుతూ మధ్యలో యాంకర్ సుమ(Suma) ప్రస్తావన తీసుకోవచ్చారు. ఇలా తన పాత్ర గురించి మాట్లాడుతూ సుమ అని పిలవగానే సుమ నిజంగానే తనని పిలిచారని అక్కడికి రావడంతో వెంటనే రాజేంద్రప్రసాద్ నిన్ను పిలవలేదులేవే ఎక్కడికి వస్తే అక్కడ గొడవ గోలేంటి అంటూ కాస్త చిరాకుగా మాట్లాడటంతో వెంటనే సుమ నన్ను పిలిచారేమో అనిపించింది సార్ అంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మరోసారి రాజేంద్రప్రసాద్ పై విమర్శలు వస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో రాజేంద్రప్రసాద్ ఏ సినిమా వేడుకకు వెళ్ళన వివాదాలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే.
ప్రేక్షకులకు కావలసిన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది..
తాజాగా యాంకర్ సుమ విషయంలో ఈయన చిరాకు పడుతూ మాట్లాడటంతో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఈ విషయంలో రాజేంద్రప్రసాద్ ఎలాంటి విమర్శలను ఎదుర్కొంటారో తెలియాల్సి ఉంది. ఇక సినిమా గురించి మాట్లాడుతూ నేను చాలా గట్టిగా చెబుతున్నాను ఈ సినిమాలో మీకు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ కావాలో అలాంటి ఎంటర్టైన్మెంట్ ఉంటుందని రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ సినిమా చూసిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నమెంట్ కూడా మెచ్చుకుంటాయి అంటూ ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. ఇలా సినిమా గురించి మాట్లాడుతూ భారీ అంచనాలనే పెంచేశారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరొక రెండు రోజులు ఎదురు చూడాల్సిందే.
Also Read: Lokesh Kangaraj -Prabhas: లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో ప్రభాస్.. సినిమా వచ్చేది అప్పుడేనా?