BigTV English
Advertisement

Jubilee Hills: గెలిచినా.. ఒడినా.. ఆయనదే భారం.. కిషన్ రెడ్డికి ఇది పెద్ద పరీక్షే!

Jubilee Hills: గెలిచినా.. ఒడినా.. ఆయనదే భారం.. కిషన్ రెడ్డికి ఇది పెద్ద పరీక్షే!

Jubilee Hills:  ఇంకెప్పుడా అనుకుంటున్న వేళ కమలదళం మొత్తానికి కదనరంగంలోకి దూకింది. కార్పెట్ బాంబింగ్ పేరుతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోకి మాస్ ఎంట్రీ ఇచ్చారు. అంతా ఒకేసారి ఉత్తరాది రాష్ట్రాల్లో చేసే తరహాలో కార్నర్ మీటింగ్స్ నిర్వహించారు. ఇక్కడివరకు అంతాబాగానే ఉన్నా.. ఇది కంటిన్యూ అవుతుందా లేక ఒక్కరోజుకే పరిమితం అవుతుందా? అనేది తెలియాల్సి ఉంది. అయితే జూబ్లీహిల్స్ గెలుపును కిషన్ రెడ్డి ఒక్కరే తన భుజాలపై మోస్తున్నారట. ఇతర నేతలంతా గిరి గీసుకుని ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.


తెలంగాణలో యోగి ఆదిత్యనాథ్ మార్క్ ప్రచారం:

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ గేర్ మార్చింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రచారంలో దూకుడు పెంచింది. అందులో భాగంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మార్క్ ప్రచారాన్ని తెలంగాణలోనూ చేపట్టి ప్రజలకు చేరువవ్వాలని ప్లాన్‌ చేసి.. దాన్ని ఇంప్లిమెంట్‌ చేసింది. ఈ ప్రచారంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లంతా పాల్గొన్నారు. పోలింగ్ బూత్ డివిజన్లను 78 శక్తి కేంద్రాలుగా విభజించుకుంది బీజేపీ. ఒక్కో శక్తి కేంద్రంలో 6 నుంచి 8 పోలింగ్ బూత్ లు ఉన్నాయి. ఏ పోలింగ్ బూత్ లో ఎవరు ప్రచారంలో పాల్గొనాలనే అంశంపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం జాబితా సిద్ధం చేయగా.. దాని ప్రకారం క్యాంపెయిన్‌ చేశారు.

తెలంగాణలో కార్పెట్ బాంబింగ్ :

గతంలో ఎన్నడూ లేనివిధంగా జూబ్లీహిల్స్‌ బైపోల్ లో కమల దళం కొత్త తరహా ప్రచారానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాజకీయాల్లో మొదటిసారిగా కార్పెట్‌ బాంబింగ్‌ కార్యక్రమం నిర్వహించింది. కుండపోత వర్షానికి క్లౌబ్‌ బరెస్ట్‌ అన్నట్లు రాజకీయాల్లో ఒక్కసారిగా అలాంటి ప్రభావంతమైన ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడాన్ని కార్పెట్‌ బాంబింగ్‌ అంటారట. ఇది ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రాచుర్యంలో ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిసారి అని బీజేపీ నేతలు చెబుతున్నారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో స్టార్‌ క్యాంపెయినర్స్‌ 40 మందితో పాటు రాష్ట్ర నేతలందరూ ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో ప్రచారంలో వెనకబడ్డారు అనే ఆరోపణలను పటాపంచలు చేసినట్టైందంటున్నారు కమలం పార్టీ నేతలు. సరే అది అలా ఉంచితే… జూబ్లీహిల్స్‌ బైపోల్‌లో కమలం పార్టీ గెలుపు బాధ్యతను కిషన్‌రెడ్డి ఒక్కడే తన భుజాలపై మోస్తున్నాడా? అంటే ఔననే సమాధానం వస్తోంది.


సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో జూబ్లీహిల్స్:

ఎన్నికల ప్రచారంలో ముఖ్య నేతలు ఎక్కువ సంఖ్యలోనే పాల్గొంటున్నా.. ఇదంతా ప్రణాళికాబద్ధంగా జరుగుతుందా లేదా అన్న సందేహాలు పార్టీ నాయకుల్లో వ్యక్తమౌతున్నాయట. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలో జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉండడంతో ఇక్కడ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే భారమంతా ఆయనపైనే పడుతోంది. పార్టీ గెలిచినా ఓడినా బాధ్యత అంతా కిషన్‌రెడ్డిదే అనే ప్రచారం పార్టీలో సాగుతోందట. దీంతో కిషన్‌రెడ్డి ఈ ఎన్నికను సవాల్‌గా తీసుకున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం కిషన్‌రెడ్డి మార్గదర్శనంలోనే ఎన్నికల ప్రచారం జరుగుతోంది. కొన్ని నెలలుగా కిషన్‌రెడ్డి ఈ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టడంతో పాటు పలు కార్యక్రమాలను ఇక్కడి నుంచే ప్రారంభించారు. డివిజన్లవారీగా ఇన్‌చార్జిలను నియమించి ప్రచారం చేపడుతున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన లంకల దీపక్‌రెడ్డికి 25 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఉప ఎన్నికల్లో కూడా ఆయనకే పార్టీ టికెట్‌ ఇవ్వటంతో ఈసారి కచ్చితంగా మెరుగైన ప్రదర్శన చూపడంతోపాటు గెలుపు వాకిట నిలిచే అవకాశాలు కొట్టిపారేయలేమని కమలం నేతలు అంటున్నారు.

గెలిచినా.. ఓడినా బాధ్యత ఆయనదే:

ఇక జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్థి ఎంపిక నుంచి గెలుపు వరకు అన్నీ కిషన్ రెడ్డి భుజాలపై ఉన్నాయి. ఇదే అంశంపై ఇటీవల నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కామెంట్ కూడా చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తమకెలాంటి బాధ్యత లేదని, పూర్తి బాధ్యత కిషన్ రెడ్డిదేనని చెప్పుకొచ్చారు. అయితే జూబ్లీహిల్స్ టికెట్ విషయంపై కిషన్ రెడ్డి, రాంచందర్ రావుల మద్య వార్ నడిచిందనే ప్రచారం జరిగింది. కిషన్ రెడ్డి ఫైనల్ చేసిన అభ్యర్థిని రాంచందర్ రావు తిరస్కరించడంతో ఆ పంచాయితీ కాస్త హైకమాండ్ కు చేరినట్లుగా కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అభ్యర్థి అంశంలో ఎన్ని ప్రచారాలు జరిగినప్పటికి ఫైనల్ గా కిషన్ రెడ్డి పంతమే నెగ్గిందనే టాక్ నడిచింది. ఏమైనా కిషన్ రెడ్డికి ఈ బైపోల్ ప్రతిష్టాత్మకంగానే మారనుంది. అభ్యర్థి ఎంపిక నుంచి గెలుపు వరకు పార్టీ అన్ని బాధ్యతలు కిషన్ రెడ్డిపైనే మోపడం వెనక ఏం జరిగిందనే టాక్ నడుస్తోంది.

సెమీ ఫైనల్ అంటూ బీజేపీ నేతల ప్రచారం:

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక వచ్చే శాసన సభ ఎన్నికలకు సెమీ ఫైనల్‌ అంటూ నేతలు బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అధికారంలోకి రావాలంటే జూబ్లీహిల్స్‌ విజయంతో నాంధి పలకాలని పార్టీ నాయకత్వం చెబుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కాంగ్రెస్‌కు ఎమ్మెల్యేలు లేరు, కార్పొరేటర్లు అంతంతే. బీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఉన్నా ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలో లేదు. దీంతో వచ్చే ఏడాది జీహెచ్‌ఎంసీలో బీజేపీ జెండా ఎగురవేయాలని క్యాడర్‌ను సమాయత్తం చేస్తున్నారట. జీహెచ్‌ఎంసీలో, రాష్ట్రంలో బీజేపీ కుర్చీ దక్కించుకోవాలంటే జూబ్లీహిల్స్‌లో విజయం సాధించాలని నేతలు భావిస్తున్నారట.

Story by Venkatesh, Big Tv

Related News

Chittoor: టీడీపీకి దిక్కెవరు.. ఉమ్మడి చిత్తూరు జిల్లా పై బాబు ప్లాన్ ఏమిటి?

Jupally Krishna Rao: మంత్రి జూపల్లిని టార్గెట్ చేసింది ఎవరు?

Khammam: ఖమ్మం డిసీసీ, నగర అధ్యక్ష పదవులకు 66 మంది పోటీ

Bihar: S.I.R 2.0 లోడింగ్.. ఈసీ ప్లాన్ ఏంటీ?

Tirupati: పరకామణి అసలు దొంగ ఎవరు? రంగంలోకి సీఐడీ

Tirupati: గ్రేటర్ తిరుపతి సాధ్యమేనా? ఇందుకు ఎదురవుతున్న అడ్డంకులు ఏమిటి?

Badvel: బద్వేల్ టీడీపీ.. కొత్త బాస్ ఎవరంటే?

Big Stories

×