Akkineni Akhil: స్టార్ హీరోల వారసులు ఇండస్ట్రీకి అడుగుపెడుతున్నారు అంటే.. వారు తండ్రిని మించి సక్సెస్ ను అందుకుంటారని అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. అయితే మన తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికీ చాలామంది నట వారసులు అడుగుపెట్టారు. కొందరు సక్సెస్ అయ్యారు. ఇంకొందరు ఇప్పుడిప్పుడే అవుతున్నారు. కానీ, ఇప్పటివరకు హీరోగా కూడా నిలబడలేకపోయిన వారసుడు అక్కినేని అఖిల్. అక్కినేని నాగార్జున నటవారసుడిగా అఖిల్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు అఖిల్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంటాడేమో అనుకున్నారు. కానీ అవ్వలేదు.
అలా ఈసారి కాకపోతే ఇంకోసారి.. ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా అని రీ రీరీ లాంచ్ లు చేయడమే తప్ప అఖిల్ ఇప్పటికీ ఒక స్ట్రాంగ్ హిట్ కొట్టింది లేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో ఒక మోస్తరు విజయాన్ని అందుకున్నా.. అది ఎంతోకాలం అఖిల్ ను ఇండస్ట్రీలో నిలబెట్టలేకపోయింది. ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందకు వచ్చి భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక పెళ్లి తరువాత ఏదైనా అయ్యగారి జీవితంలో మార్పు వస్తుందని నాగ్.. అఖిల్ పెళ్లి కూడా జరిపించాడు. ఇప్పుడు ప్రస్తుతం అఖిల్ చేతిలో లెనిన్ సినిమా ఉంది. అది కూడా రకరకాల కారణాలతో అవ్వాలా వద్దా అన్నట్లు సాగుతుంది. ప్రస్తుతం అఖిల్ ను కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ తో పోలుస్తూ ట్రోల్ చేస్తున్నారు.
అఖిల్ లానే ధృవ్ కూడా నటవరాసుడిగా అర్జున్ రెడ్డి రీమేక్ తో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ఆశించిన పాలితాన్ని అందుకోలేకపోయింది. ఆ తరువాత మహాన్ తో వచ్చాడు. అది ఓటీటీకి పరిమితమయ్యింది. అలా ఈ కుర్ర హీరో కూడా హీరోగా స్ట్రగుల్ అవుతూ వచ్చాడు. ఇక చలా గ్యాప్ తరువాత బైసన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈమధ్యనే రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక అఖిల్- ధృవ్ లో ఉన్న సేమ్ పాయింట్ ఏంటి అంటే.. ఇద్దరూ కథల ఎంపికలో తప్పటడుగులు వేశారు. దీని వలనే వీరి కెరీర్ వెనకబడింది.
ఇప్పుడు ధృవ్ ఎలాంటి కథలను ఎంచుకుంటే ముందకు వెళ్తాం అనేది తెలుసుకొని ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇదే విషయం అఖిల్ కూడా తెలుసుకొని మంచి మంచి కథలను ఎంచుకుంటే.. అఖిల్ కి తోడుగా అక్కినేని ఫ్యాన్స్ ఎప్పుడు ఉండనే ఉంటారు. చివరకి ధృవ్ కూడా హిట్ కొట్టాడు.. లెనిన్ తో ఈసారి నువ్వు కూడా హిట్ అందుకోవాలి అన్నా అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ కోసమైన అఖిల్.. లెనిన్ తో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.