HYDRA: హైడ్రా వచ్చాక హైదరాబాద్ నగరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యం ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను హైడ్రా గుర్తించి స్వాధీనం చేసుకుంటుంది. ఇలా ఇప్పటికే వందల ఎకరాల ప్రభుత్వ భూములను హైడ్రా గుర్తించింది. దీంతో హైదరాబాద్ నగర వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నగరంలో చెరువుల చుట్టు పక్కల భూములను ఆక్రమణ దారులు కబ్జా చేశారు. వీటిని హైడ్రా గుర్తించి భూములను స్వాధీన పరుచుకుంటుంది. తాజాగా నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆక్రమణలను హైడ్రా మంగళవారం తొలగించింది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి హైడ్రా రంగంలోకి దిగుతోంది. ఆక్రమణదారుల్లో గుండెల్లో పరుగులు పెట్టిస్తోంది.
తాజాగా ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులతో పరిశీలించిన అనంతరం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంది. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం కర్మన్ ఘాట్ విలేజ్ లోని హస్తినాపురం నార్త్ ఎక్స్‌టెన్షన్ కాలనీలో 1.27 ఎకరాల పార్కు కబ్జా చేశారంటూ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
ALSO READ: Cyclone Montha: తీరాన్ని తాకిన మొంథా తుఫాన్.. ఇంకో 3 గంటల్లో తీరం దాటనున్న సైక్లోన్
పార్కు స్థలాన్ని లే అవుట్ లో చూపించి తర్వాత ప్లాట్లుగా విక్రయిస్తున్నారనే ఫిర్యాదును క్షేత్రస్థాయిలో విచారించి ఆక్రమణలను హైడ్రా తొలగించింది. చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా కాపాడినట్టు పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది. అలాగే శేరిలింగంపల్లి జోన్ చందానగర్ సర్కిల్ పరిధిలోని గంగారాం కాలనీలో సుభాష్‌నగర్ పేరిట 1974 లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ వాళ్లు లే ఔట్ వేశారు.
ALSO READ: Cyclone Montha: దూసుకొస్తున్న మొంథా.. ఈ ఏడు జిల్లాల్లో తుఫాన్ ఉగ్రరూపం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు
ఇందులో 700 గజాల స్థలాన్ని ప్రజావసరాలకు కేటాయించారు. పేదలకు ఉద్దేశించిన లే అవుట్ లో బడాబాబు పాగా వేశారు. ఆ లేఔట్‌లో ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాన్ని ప్లాట్లుగా మార్చాడు. ఇలా ఆక్రమణలకు గురైన స్థలాన్ని కాపాడాలని అక్కడి నివాసితులు ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా ఆక్రమణలు తొలగించి హైడ్రా ఫెన్సింగ్ వేసింది.