Mass Jathara Event : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ ప్రొడక్షన్ హౌస్ లో ఇతర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఒకటి. బ్యానర్ లో నాగ వంశీ సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. ఈ బ్యానర్ నుంచి ఎప్పుడు సినిమా విడుదలైన నాగవంశీ వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. కొన్ని సందర్భాలలో నాగ వంశీ చేసిన కామెంట్స్ సినిమా మీద కూడా ఎఫెక్ట్ చేస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.
కొన్ని సినిమాలు మీద విపరీతంగా అంచనాలు పెంచేస్తూ ఉంటాడు వంశీ. అయితే ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా తర్వాత కంప్లీట్ గా నాగవంశీ స్లో అయిపోయారు. ఆ సినిమా ఫలితం ఊహించిన విధంగా రాకపోవడంతో బాగా డిసప్పాయింట్ అయినట్లు కనిపిస్తుంది. ఇక మాస్ జాతర సినిమా ఈవెంట్ లో దర్శకుడు భాను మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నాగ వంశీ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కొన్ని వెబ్ సైట్లు పేర్లు చెప్పాడు భాను. వాటన్నిటిని మించి పెద్ద రివ్యూవర్ నాగవంశీ అని తెలిపాడు. నేను సినిమా చూసి ఎక్స్ట్రాడినరీగా ఉంది సెకండ్ ఆఫ్ ఇరగ తీసేశారు అని నాతో చెప్పారు. నాతో మాత్రమే కాకుండా పబ్లిక్ తో కూడా చాలాసార్లు చెప్పారు.
ఆయన చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఇంకా రెడీ అవ్వలేదు. కొంచెం బ్యాలెన్స్ ఉంది. ఫస్ట్ ఆఫ్ కూడా అదిరిపోద్ది. సెకండాఫ్ తో పాటు ఫస్ట్ ఆఫ్ కూడా బాగుంటుంది. ఆయన ఫస్ట్ ఆఫ్ సరిగా చూడలేదు కాబట్టి సెకండ్ 1/2 అదిరిపోయింది అని చెబుతున్నారు. అక్టోబర్ 31 కోసం నేను చాలా ఎక్సైట్మెంట్తో ఎదురు చూస్తున్నాను. జై మాస్ మహారాజ్ అంటూ స్పీచ్ ఫినిష్ చేశారు.
రవితేజ విషయానికి వస్తే చాలా మంది కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. బాబీ, గోపీచంద్ మలినేని వంటి దర్శకులు ఇప్పుడు టాప్ లో ఉన్నారు. ఈ సినిమాతో భాను కూడా దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.
అయితే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ అలా ఉన్నట్లు రవితేజ గారి యూనివర్సిటీ కూడా ఉంటుంది. నేను ఆ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందుకొని బయటకు వచ్చాను అని ఎలివేషన్ కూడా ఇచ్చాడు భాను.
Also Read: Bheems ceciroleo : ఆ రోజుతో నాకు భూమి మీద నూకలు చెల్లిపోయాయి అనుకున్నా, అప్పుడు రవితేజ గారు…