OTT Movie : రియల్ క్రైమ్ సంఘటనల నుండి చాలా స్టోరీలతో సినిమాలు, సిరీస్ లు తెరకెక్కుతున్నాయి. వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు థ్రిల్లర్ అభిమానులు. అయితే వీటిలో కొన్ని స్టోరీలు, అడల్ట్ కంటెంట్ కారణంగా ఒంటరిగానే చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, ఒక సైకో చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో ముగ్గురు అమ్మాయిలను ఆ సైకో బంధించి టార్చర్ చేస్తాడు. ఫ్యామిలిగా ఉందామని నరకం చూపిస్తాడు. చివరికి ఏం జరుగుతుందనేదే ఈ కథ. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే..
‘బ్లూ ఫ్యామిలీ’ (Blue Family) 2014లో వచ్చిన అమెరికన్ థ్రిల్లర్ సినిమా. డైరెక్టర్స్ గుయిల్లెర్మో ఇవాన్, బెన్ లాగ్గిన్స్ దీనిని రూపొందించారు. ఇందులో అర్మాండో (గుయిల్లెర్మో ఇవాన్), జూలియా (రీగాన్ వాలెస్), జెస్సికా (రాచెల్ ట్రుట్ట్), ఎరిన్ (నాన్సీ చార్టియర్) ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 36 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాను Tubi, Plex, Amazon Prime లో చూడవచ్చు.
అర్మాండో అనే యువకుడు పాత కార్లను కొని, అమ్ముతూ ఉంటాడు. అతని బిజినెస్ కూడా బాగానే ఉంటుంది. బయట చూస్తే మంచి మనిషి, ఫ్రెండ్లీగా కనిపిస్తాడు. కానీ అతని లోపల ప్రపంచం వేరేలా ఉంటుంది. చిన్నప్పుడు తల్లిదండ్రులు అతన్ని ఎక్కువగా టార్చర్ చేయడంతో మానసికంగా బాధపడుతుంటాడు. దీంతో అతను ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ కావాలని కల కంటాడు. ఈ డ్రీమ్ వల్ల జూలియా, జెస్సికా, ఎరిన్ అనే ముగ్గురు అందమైన అమ్మాయిలను కిడ్నాప్ చేస్తాడు. వాళ్లను తన ఇంటి బేస్‌మెంట్ లో లాక్ చేస్తాడు. “నువ్వు నా భార్య, నువ్వు నా సిస్టర్” అని మనమంతా ఫ్యామిలీ అని చెప్తాడు. అమ్మాయిలు మొదట భయపడతారు, ఏడుస్తారు. కానీ క్రమంగా ముగ్గురూ ఫ్రెండ్స్ అవుతారు. ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలని అనుకుంటారు.
Read Also : పక్కింటి అమ్మాయిపై ఆ ఫీలింగ్…తేడా అంటూ కోడై కూసే ఊరు… మస్ట్ వాచ్ మలయాళ మూవీ
అర్మాండో బయట ఆఫీస్, ఫ్రెండ్స్ తో సాధారణంగా ఉంటాడు. ఇంట్లో మాత్రం శాడిస్ట్ లా బిహేవ్ చేస్తుంటాడు. రాత్రయితే అమ్మాయిలకు నరకం చూపిస్తుంటాడు. ఇలా వాళ్ళు రెండు సంవత్సరాలు బేస్‌మెంట్‌లోనే గడుపుతారు. అర్మాండో వాళ్ళకి తిండి పెడుతూ, మన ఫ్యామిలీ హ్యాపీగా ఉందని అనుకుంటాడు. అయితే అమ్మాయిలు అతన్ని తీవ్రంగా ద్వేషిస్తారు. వీళ్ళు ఒకరినొకరు ధైర్యం చెప్పుకుంటూ, ఏదో ఒక రోజు బయటపడతాం అని ఆశ పడుతుంటారు. వీళ్ళు అప్పుడప్పుడు తప్పించుకునే ప్రయత్నాలు చేసినా వర్క్ అవుట్ కాకుండా పోతాయి. ఒక రోజు ముగ్గురూ ఒక స్మార్ట్ ప్లాన్ వేస్తారు. అర్మాండో ఇంటికి వచ్చినప్పుడు ఒకరు డైవర్ట్ చేస్తారు, మిగతా ఇద్దరు తలుపు తెరుస్తారు. ముగ్గురూ బయటికి పరిగెత్తుతారు. అర్మాండో వెనక్కి వచ్చి ఆపడానికి ట్రై చేస్తాడు. చివరికి ఈ అమ్మాయిలు ఆ సైకో నుంచి తప్పించుకుంటారా ? మళ్ళీ పట్టుబడతారా ? అనే విషయాలను, ఈ థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోండి.