Shriya (5)
Shriya Saran Latest Photos: హీరోయిన్ శ్రియా వెండితెరపై కనిపించి చాలా కాలం అయ్యింది. తెలుగులో చివరిగా ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన శ్రియా.. ఇటీవల సూర్య రెట్రో చిత్రంలో కీలక పాత్రలో మెరిసింది.
Shriya (6)
ఒకప్పుడు సౌత్‌లో స్టార్ హీరోయిన్గా రాణించిన ఈ భామ ప్రస్తుతం ఆడపదడపా చిత్రాలు.. చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తోంది. మరోవైపు ఫ్యాషన్ షోలో పాల్గొంటూ ర్యాంప్ వాక్‌తో ఆకట్టుకుంటోంది.
Shriya (7)
పెళ్లి తర్వాత సినిమాలు బాగా తగ్గించిన ఈ ముద్దుగుమ్మ వ్యాపారం రంగంలోకి అడుగుపెట్టింది. అటూ బిజినెస్.. ఇటూ సినిమాల్లో నటిగా రాణిస్తోంది. మరోవైపు తల్లిగానూ కూతురి ఆలనపాలన చూసుకుంటుంది.
Shriya (1)
ఇలా పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తోంది. ఇక త్వరలోనే మిరాయ్ చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందు రాబోతోంది. సూపర్ హీరో మైథలాజికల్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో శ్రియా అంబిక అనే కీలక పాత్రలో నటిస్తోంది.
Shriya (2)
ఇందులో హీరోకి శక్తివంతమైన తల్లిగా కనిపించబోతున్నారు. ఇటీవల ఆమె రోల్‌ని పరిచయం చేస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. మిరాయ్ శ్రియ నటిస్తున్నట్టు తెలిసి అంత సర్ప్రైజ్ అయ్యారు.
Shriya (3)
ఇక ట్రైలర్లో తన లుక్‌తో అందరికి ఆకట్టుకుంది. ప్రస్తుతం మిరాయ్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. ఫ్యాన్సీ చీరలో శ్రియా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
Shriya (4)
ఎర్రటి సిల్కి చీరలో శ్రియా అదిరిపోయే ఫోజులతో మెస్మరైజ్ చేస్తుంది. రెడ్ హాట్ మీర్చిలా హాట్ లుక్స్‌తో నెటిజన్స్ చేస్తున్న శ్రియా లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.
Shriya (8)
ఎర్రటిలో మనసులు దోచేస్తున్నావ్ అంటూ నెటిజన్స్ ఆమె ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రియ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.