Womens World Cup 2025: వన్డే మహిళ వరల్డ్ కప్ 2025 టోర్నమెంటు చాలా ఆసక్తికరంగా సాగుతోంది. అయితే ఇండియా ఆథిధ్యం ఇస్తున్న ఈ టోర్నమెంట్ లో మనోళ్లే సరిగ్గా ఆడడం లేదు. దీంతో టీమ్ ఇండియా సెమీ ఫైనల్ కు వెళ్తుందా ? లేదా? అనే టెన్షన్ అందరిలోనూ నెలకొంది. కానీ టీమిండియా ఇప్పటికీ కూడా సెమీ ఫైనల్ కు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. టీమిండియా సెమీ ఫైనల్ కు వెళ్లాలంటే తన తర్వాతే రెండు మ్యాచ్ లు కూడా ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ తో టీమిండియా తలపడాల్సి ఉంది.
Also Read: INDW vs ENGW: స్మృతి , హర్మన్ పోరాటం వృధా…సెమీస్ కు దూసుకెళ్లిన ఇంగ్లాండ్..టీమిండియాకు ఇంకా ఛాన్స్
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంటులో టీమిండియా సెమీ ఫైనల్ కు వెళ్లే అవకాశాలు ఇంకా కూడా ఉన్నాయి. నిన్న ఇంగ్లాండ్ తో ఓడిపోయినప్పటికీ సెమీ ఫైనల్ కు టీమ్ ఇండియా వెళ్లవచ్చు. రాబోయే రెండు మ్యాచ్ లలో అంటే న్యూజిలాండ్ అలాగే బంగ్లాదేశ్ పైన కచ్చితంగా టీమిండియా గెలవాలి. అలా గెలిస్తే ఇతర జట్లతో సంబంధం లేకుండా టీమిండియా సెమీ ఫైనల్ కు కచ్చితంగా చేరుతుంది. అంతేకాదు న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడిపోతే మాత్రం బంగ్లాదేశ్ పైన కచ్చితంగా గెలవాలి. మరోవైపు ఇంగ్లాండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోవాల్సి ఉంటుంది. అదే సమయంలో ఇతర జట్లతో పోలిస్తే మెరుగైన రన్ రేట్ టీమ్ ఇండియాకు ఉంటే, న్యూజిలాండ్ ను ఇంటికి పంపి మనోళ్లు సెమీ ఫైనల్స్ కు దూసుకువెళ్తారు.
అంటే సెమీ ఫైనల్ బెర్త్ కోసం టీమిండియాతో పాటు న్యూజిలాండ్ తలపడుతున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టీమిండియా నాలుగో స్థానంలో ఉంటే న్యూజిలాండ్ ఐదో స్థానంలో ఉంది. రెండు జట్లలకు కూడా నాలుగు పాయింట్లు మాత్రమే ఉన్నాయి. కానీ టీమిండియా రన్ రేట్ కాస్త మెరుగ్గా ఉండటంతో నాలుగో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ రన్ రేట్ మైనస్ లో ఉండడంతో ఐదు స్థానంలోకి పడిపోయింది. న్యూజిలాండ్ అద్భుతంగా రాలిస్తే టీమిండియా ఇంటికి వెళ్లడం పక్క. అలా కాదని టీమిండియా వరుసగా రెండు మ్యాచ్ లు గెలిస్తే సెమీ ఫైనల్ కు దూసుకు వెళ్తుంది.
Also Read: Sara Tendulkar: 28 ఏళ్ల సారా ఇంత అందంగా ఉండటం వెనుక సీక్రెట్ ఇదే.. రాత్రి అయితే అవే పనులు ?
వన్డే మహిళ వరల్డ్ కప్ 2025 టోర్నమెంటులో భాగంగా నేడు శ్రీలంక, బంగ్లా మధ్య ఫైట్ జరుగనుంది. నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో శ్రీలంక, బంగ్లా మధ్య మ్యాచ్ జరుగనుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ జరుగనుంది. ఇందులో ఏ జట్టు గెలిచినా, పెద్ద ప్రయోజనం ఉండదు. రెండు జట్లు కూడా ఇంటికే వెళతాయి. ఇంగ్లాండ్, ఆసీస్, దక్షిణాఫ్రికా సెమీస్ కు దూసుకెళ్లాయి.