INDW VS ENGW: ఐసీసీ వన్డే మహిళల వరల్డ్ కప్ 2025 ( ICC Womens World Cup 2025 ) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మందాన ( Smriti Mandhana ) ఎమోషనల్ అయ్యారు. ఎక్కి ఎక్కి ఏడ్చేశారు స్మృతి మందాన. నిన్న టీం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ( India Women vs England Women) మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో టీమిండియా పోరాడి ఓడిపోయింది. కేవలం నాలుగు పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోవడం జరిగింది. అయితే, ఈ మ్యాచ్ లో టీమిండియాను గెలిపించేందుకు అద్భుతంగా ఆడిన స్మృతి మందాన ఎమోషనల్ అయ్యారు. మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
Also Read: INDW vs ENGW: స్మృతి , హర్మన్ పోరాటం వృధా…సెమీస్ కు దూసుకెళ్లిన ఇంగ్లాండ్..టీమిండియాకు ఇంకా ఛాన్స్
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా నిన్న ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించినప్పటికీ చివరి క్షణంలో టీమిండియా చేతులెత్తేసింది. కేవలం నాలుగు పరుగుల తేడాతో టీమిండియా పై ఇంగ్లాండ్ విజయం సాధించింది. స్మృతి మందానతో పాటు హర్మన్ ప్రీత్ కౌర్ ఇద్దరు అద్భుతంగా రాణించినప్పటికీ టీం ఇండియా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ మహిళల జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. ఈ సందర్భంగా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది టికెట్ నష్టపోయిన ఇంగ్లాండు 288 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ కు చెందిన నైట్ అద్భుతంగా రాణించింది. ఆమె 109 పరుగులతో రెచ్చిపోయింది.
జోన్స్ 56 పరుగులతో దుమ్ము లేపారు. ఇక 289 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో టీమిండియా మంచి స్టార్టింగ్ అందుకుంది. కానీ చివరలో మాత్రం చేతులెత్తేసింది. స్మృతి మందాన ఈ మ్యాచ్ లో 88 పరుగులు చేసి దుమ్ము లేపారు. కానీ ఆమె చివరి వరకు ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. అటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 70 బంతుల్లో 70 పరుగులు చేశారు. దీప్తి శర్మ కూడా 50 పరుగులు చేసి రాణించారు. కానీ చివరి వరకు స్టార్ ప్లేయర్లు బరిలో ఉండకపోవడంతో టీమిండియా ఓడిపోయింది. ఈ ఓటమి నేపథ్యంలో ఇంగ్లాండు సెమీ ఫైనల్ కు దూసుకు వెళ్ళింది. టీమిండియాకు మాత్రం సెమీస్ ఆశలు మరింత కఠిన తరం అయ్యాయి.
ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయిన నేపథ్యంలో లేడీ కోహ్లీ స్మృతి మందాన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ మ్యాచ్ లో కచ్చితంగా టీమిండియా గెలివాల్సి ఉంది. దీంతో చివరి వరకు పోరాడారు టీమిండియా. స్మృతి మందానతో పాటు, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఇద్దరూ ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ చివరకు ఓడింది. దీంతో కన్నీళ్లు పెట్టుకున్నారు స్మృతి మందాన. ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
Smriti Mandhana got emotional when India lost the match against England. 🥺💔
– Smriti Mandhana's reactions says it all..!!!! pic.twitter.com/REhGSoZid3
— Tanuj (@ImTanujSingh) October 19, 2025